ప్రఖ్యాత ఆలయ గెస్ట్ హౌస్ లో అన్యమతస్తుల క్వారంటైన్,భక్తుల ఆగ్రహం  

Pagans Quutarantine In Kanipakam Temple Guest House - Telugu Coronavirus, Kanipakam Temple, Quarantine, Twitter

ఏపీ లోని ప్రఖ్యాత ఆలయం శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం లోని గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Pagans Quutarantine In Kanipakam Temple Guest House

అయితే ఇలా ఆలయానికి సంబందించిన గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ సెంటర్స్ గా మార్చి అన్యమతస్తులను క్వారంటైన్ చేయడం పై మాజీ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు తీవ్రంగా తప్పుబట్టారు.మరోపక్క పలువురు ఇదే అంశంపై మండిపడుతున్నారు.

హిందూ దేవాలయానికి సంబందించిన గెస్ట్ హౌస్ లో ఇలా అన్యమతస్తులను క్వారంటైన్ లో ఉంచడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు వారంతా అక్కడ చెప్పులతోనే అటూ ఇటూ తిరుగుతున్న వీడియో లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో ఈ విషయం కాస్త డీజీపీ కార్యాలయం వరకు చేరింది.
అయితే దీనిపై స్పందించిన అధికారులు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్ కేంద్రంగా మార్చామని అందులో తప్పేమి లేదంటూ అధికారులు తమని తాము సమర్ధించుకున్నారు.అయితే అధికారులు స్పందించిన తీరు మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.

ప్రఖ్యాత ఆలయ గెస్ట్ హౌస్ లో అన్యమతస్తుల క్వారంటైన్,భక్తుల ఆగ్రహం-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనితో ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.ఇది ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అని నిలదీశారు.ఇంకెక్కడా వసతి సదుపాయమే లేనట్టు… దీన్ని అన్యమతస్తుల కోసమే వాడుతుండటంలో అంతరార్థం ఏంటి అంటూ ప్రశ్నించారు.వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆలయ ప్రాంగణంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం, దీంట్లో అన్యమతస్తులు తిరుగుతుండటంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో క్వారంటైన్ సెంటర్స్ ను నెలకొల్పారు.అయితే ఇలా హిందూ దేవాలయ గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ కేంద్రంగా మార్చి దానిలో అన్యమతస్తులను క్వారంటైన్ చేయడం తో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pagans Quutarantine In Kanipakam Temple Guest House Related Telugu News,Photos/Pics,Images..