సింగర్ సునీత జీవితాన్ని మలుపు తిప్పిన షో ఏదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సింగర్లు ఎంతమంది ఉన్నా సింగర్ సునీత ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.సునీత పాడిన ఎన్నో పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Padave Koyila Show Turning Point For Singer Sunitha Career-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్న సునీత పెళ్లి తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

పలు రియాలిటీ షోలకు సింగర్ సునీత జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.వందల సంఖ్యలో పాటలు పాడిన సునీతకు అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.అయితే సింగర్ సునీత జీవితాన్ని మలుపు తిప్పిన షో పాడవే కోయిల షో అని తెలుస్తోంది.1995 సంవత్సరంలో దూరదర్శన్ లో ఈ షో ప్రసారమైంది.ఈ షోలో పాట పాడటం ద్వారా సునీతకు సింగర్ గా క్రేజ్ వచ్చింది.

 Padave Koyila Show Turning Point For Singer Sunitha Career-సింగర్ సునీత జీవితాన్ని మలుపు తిప్పిన షో ఏదో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Gulabi Movie, Padave Koyila, Singer Sunitha, Singer Sunitha Daughter, Sunitha Career, Turning Point, Zee Telugu-Movie

ఈ షో తర్వాత సింగర్ సునీత గులాబీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు.ఆ సినిమాలో సునీత పాడిన ఈ వేళలో నీవు పాటను తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు.ప్రస్తుతం సునీత జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

సునీత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

Telugu Gulabi Movie, Padave Koyila, Singer Sunitha, Singer Sunitha Daughter, Sunitha Career, Turning Point, Zee Telugu-Movie

సునీత కూతురు కూడా సింగర్ గా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.సునీత స్థాయిలో ఆమె కూతురు కూడా ఇండస్ట్రీలో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.సోషల్ మీడియాలో సైతం సునీత యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లు కోరిన పాటలను పాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

లాక్ డౌన్ రూల్స్ కఠినంగా అమలైన సమయంలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రతిరోజూ అరగంట పాటు సునీత లైవ్ లోకి వచ్చి పాటలు పాడిన సంగతి తెలిసిందే.

#SingerSunitha #Padave Koyila #Singer Sunitha #Sunitha Career #Turning Point

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు