ఇంట్లోనే ఆక్సిజన్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే..?!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్  వేవ్ విజృంభణ ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకీ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

 Oxygen Mission At Home .. How Does It Work  Oxygen Machines, Carona Virus, Oxyge-TeluguStop.com

దీంతో అలర్ట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపడుతున్న కానీ విజృంభణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.ఇది ఇలా ఉండగా మరోవైపు కొన్ని రాష్ట్రాలలో హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత చాలా ఉన్నట్లు మనం వార్తలలో చూసే ఉన్నాం.

ఈ కారణం చేత కరోనా వైరస్ సీరియస్ గా ఉన్న పేషెంట్లకు మాత్రమే ఆక్సిజన్ మిషన్ ను ఉపయోగిస్తున్నారు వైద్యులు.మరికొన్ని ఆస్పత్రుల్లో అయితే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండి, కరోనా నెగటివ్ వచ్చిన  కూడా వాళ్లకు ట్రీట్మెంట్ లో ఆక్సిజన్ కూడా అందచేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఇలాంటి వారు హాస్పిటల్స్ కు వెళ్లకుండా వారి ఇంట్లోనే ఆక్సిజన్ మిషన్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.ఇంట్లో ఉండే గాలిని తీసుకొని ప్యురిఫై చేసి ఆక్సిజన్ ను అందిస్తుంది ఈ మిషన్.

ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.అంతేకాకుండా ప్రస్తుతానికి ఆక్సిజన్ సిలిండర్ ల కంటే ఈ మిషన్స్ కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ప్రముఖ డీలర్లు పేర్కొంటున్నారు.

ఇవి చూడటానికి అచ్చం వాటర్ ప్యూరిఫైయర్ లాగానే ఉన్నా కానీ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అని పిలుస్తారు.వీటి ధర విషయానికి వస్త మార్కెట్ లో 80 వేల వరకు ఉంటుందని డీలర్లు పేర్కొంటున్నారు.

మార్కెట్ లోని డిమాండ్ ను  బట్టి రెంట్  సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్లు డీలర్లు తెలుపుతున్నారు.ఈ మిషన్లను హైదరాబాద్ కు  చెందిన కొంతమంది డీలర్లు ఇతర రాష్ట్రాల నుంచి తేప్పించుకొని వారి కస్టమర్లకు అందచేస్తూ ఉన్నారు.

కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా హాస్పిటల్ యాజమాన్యం వారు కూడా ఇవే  ఉపయోగిస్తున్నట్లు డీలర్లు తెలుపుతూ ఉన్నారు.మరోవైపు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకునే వారికి కూడా ఈ ఆక్సిజన్ మిషన్స్  ఎంతగానో సహాయ పడుతుందని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు.

ఆక్సిజన్ మిషన్ల పనితీరు విషయానికి వస్తే ఈ మిషన్ మనం కొనుగోలు చేసిన తర్వాత మన ఇంట్లోనే ఒక ప్రదేశంలో ఉంచుతాం.ప్రదేశం చుట్టూ ఉన్న గాలిని తీసుకొని అది ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ ను అందజేస్తూ ఉంది.

వాస్తవానికి గాలిలో ఎక్కువగా నైట్రోజన్ శాతం లభిస్తుంది, ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది.దానిని పిక్ చేసుకొని  మిషన్ లో సేవ్ చేసుకొని ఇంట్లో ఉండే వారికి అందజేస్తూ ఉంది.

ఈ మిషన్ ను కస్టమర్స్  ఆర్డర్ ఇచ్చిన తర్వాత డీలర్లు వారి టీం తో పాటు ఇంట్లో సెట్ చేసి మరి ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా తెలియచేస్తారు.ఏది ఏమైనా కానీ ఇది కరోనా పేషెంట్స్ కు ఒక శుభవార్త అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube