ఈ స్మార్ట్ వాచ్‌ తో ఆక్సిజ‌న్ స్థాయిలను సులువుగా తెలుసుకోవచ్చు ..!

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.చాలా మంది ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నారు.

 Oxygen Levels Can Be Easily Detected With This Smart Watch-TeluguStop.com

కరోనా సోకినవారి బంధువులు, కుటుంబీకులు ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.క‌రోనా సోకిన వారిలో చాలా మంది శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలో త‌గ్గ‌డంతో మృత్యువాత ప‌డుతున్నారు.

ఇందులో భాగంగానే ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ స్థాయిల‌ను చెక్ చేసుకుంటూ చికిత్స తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఇటువంటి పరిస్థితులలో మన శరీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను చూపించే కొన్ని స్మార్ట్ వాచ్‌లు మనముందుకు వచ్చాయి.

 Oxygen Levels Can Be Easily Detected With This Smart Watch-ఈ స్మార్ట్ వాచ్‌ తో ఆక్సిజ‌న్ స్థాయిలను సులువుగా తెలుసుకోవచ్చు ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మార్కెట్లో ఇవి అతి వక్కువ రేటుకే దొరుకుతున్నాయి.వీటిని వేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను కనుగొంటూ ఉండొచ్చు.

ఒక వేళ ఆక్సిజన్ స్థాయి తగ్గితే వెంటేనే జాగ్రత్తలు తీసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మార్కెట్లో దొరికే ఆ స్మార్ట్ వాచ్ ఏవేవి ఉన్నాయో వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌న్‌ప్ల‌స్ వాచ్‌ అనేది వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌తో అందుబాటులోకి వచ్చింది ఈ స్మార్ట్ వాచ్ SpO2 మానిట‌రింగ్‌ను అందిస్తోంది.ఈ స్మార్ట్ వాచ్ రూ.12, 999ల‌కు అందుబాటులో ఉంది.రియ‌ల్‌మి వాచ్ ఎస్‌ అనే ఈ స్మార్ట్ వాచ్ ద్వారా శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేస్తుంది.సుమారు 15 రోల‌జు బ్యాట‌రీ లైఫ్‌ను అందించే ఈ స్మార్ట్ వాచ్ ధ‌ర రూ.4,999గా ఉంది.హానర్ బ్యాండ్ 5ఐ అనే స్మార్ట్ వాచ్ త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి వచ్చింది.ఈ వాచ్ ధ‌ర రూ.1,199లు మాత్రమే.ఈ స్మార్ట్ వాచ్ ఆక్సిజ‌న్ లెవల్స్‌తో పాటు హార్ట్ రేట్‌ను కూడా మానిట‌రింగ్ చేస్తుంది.

అమేజ్‌ఫిట్ జిటిఆర్2 అనే స్మార్ట్ వాచ్ 14 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో అందుబాటులో వచ్చింది.ఈ స్మార్ట్ వాచ్ ఆక్సిజ‌న్ మానిట‌రింగ్‌తో స్లీప్ అండ్ స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.దీని ధ‌ర రూ.9, 499గా ఉంది.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేసి మీ ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకుంటూ కరోనా నుంచి జాగ్రత్తపడండి.

#COVID-19 #Measuring #Carona Virus #Smart Watch #Body

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు