ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడి ప్రాణాన్ని బలిగొన్న సిలిండర్.. !

కరోనా బాధితుల పట్ల ప్రాణదాతగా మారిన ఆక్సిజన్ అప్పుడప్పుడు ప్రాణాలను కూడా తీస్తుంది.అసలే కరోనా కొరలకు చిక్కిన జనం అల్లాడుతుంటే ఈ సమయంలో ఆక్సిజన్ అమృతం కంటే విలువైనదిగా భావించబడుతుంది.

 Oxygen Cylinder Explodes While Refilling In-TeluguStop.com

కానీ ప్రాణం పోసే ఈ ఆక్సిజన్ వల్ల జరిగే ప్రమాదాలు ఊహించలేకుండా ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో అతి విలువైన ఆక్సిజన్ సిలిండర్‌‌లు పేలుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

 Oxygen Cylinder Explodes While Refilling In-ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడి ప్రాణాన్ని బలిగొన్న సిలిండర్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవి కూడా కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో జరగడం విషాదకరం.ఇకపోతే ఉత్తరప్రదేశ్‌లోని పాంకి ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి కార్మికుడు మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లుగా సమాచారం.

కాగా దాదా నగర్ ఇండస్ట్రియల్ ఏరియా లో ఉన్న ఈ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుందట.ఇక ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

#Explodes #Covid Hospital #OxygenCylinder #Refilling #Oxygen Cylinder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు