మనుష్యులు పీల్చే గాలికి ప్రపంచంలో ఎక్కడ వెల కట్టలేము.కానీ ఢిల్లీలో మాత్రం అన్నీ సాగుతాయి అంటున్నారు అక్కడున్నావారు.
మరి ఢిల్లీలో కాలుష్యం ఆ రేంజులో ఉంది కాబట్టే అక్కడి జనం స్వచ్ఛమైన గాలి కోసం నానా తంటాలు పడుతున్నారు.అలాంటి వారి కోసం అక్కడ కొత్తగా బార్లు తెరుచుకున్నాయి.
బార్లు అంటే వెళ్లి ఫుల్లుగా మందు తాగి పడిపోతారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.అక్కడ బార్లు అంటే ఆక్సిజెన్ బార్లు అని అర్ధం.స్వచ్ఛమైన గాలిని కేవలం రూ.1500కు 15 నిమిషాలు పీల్చి రావచ్చు.ఇంత స్వచ్ఛమైన గాలి తమ ఆరోగ్యానికి చాలా లాభదాకం అని పలువురు పేర్కొన్నారు.
మరి గాలి కోసం కూడా ఇలా బార్లను వెంబడిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
మంచి గాలి కోసం గాలికి తిరిగేవారు కోసం క్యూ కడుతుండటంతో ఈ వ్యాపారం చేసేవారు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.