ఆక్స్ ఫర్డ్ టీకా సురక్షితం.. ట్రయల్స్ మళ్లీ ప్రారంభం !

ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగం మళ్లీ షురూ అయింది.మూడోదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ కు అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ ని నిలిపివేసింది.

 Oxford Restarts Trials,oxford, Corona, Vaccine Safe, Trials, Again-TeluguStop.com

ఈ మేరకు ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.దీంతో దర్యాప్తు చేపట్టిన కమిటీ ఆక్స్ ఫర్డ్ టీకా సురక్షితమేనని వెల్లడించింది.

టీకా భద్రతపై నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ టీకా సురక్షితమని చెప్పడంతో క్లినికల్ ట్రయల్స్ మళ్లీ ప్రారంభిస్తామని శనివారం ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.ప్రయోగాలు మళ్లీ ప్రారంభించేలా మెడిసన్స్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) అనుమతి ఇవ్వాలని స్వతంత్ర నిపుణుల కమిటీ సిపార్సు చేసింది.

దీంతో అనుమతులు వచ్చిన వెంటనే ప్రయోగాలు ప్రారంభం అవుతాయని ఆస్ట్రాజెనెకా తెలిపింది.అయితే ఈ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై దేశంలోని ముంబయిలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

మెడిసన్స్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) అనుమతితో పాటు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి రాగానే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా పేర్కొన్నారు.క్లినకల్ ట్రయల్స్ ముగిసిన తర్వాత టీకా ఉత్పత్తికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube