ఇండియాలో ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగం మళ్లీ షురూ !

ఇండియాలో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మళ్లీ షురూ చేయనుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ముంబాయికి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు ఇచ్చింది.

 Oxford To Restart Corona Vaccine Clinical Trials, Oxford, Corona, Vaccine, Trial-TeluguStop.com

బ్రిటన్ లో ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగంలో ఓ వాలంటీర్ అనారోగ్య సమస్య తలెత్తడంతో ట్రయల్స్ నిర్వహణను నిలిపివేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ కు చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ట్రయల్స్ నిర్వహించడంతో మెరుగైన ఫలితాలు వచ్చేంతవరకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోమని సీరమ్ ఇనిస్టిట్యూడ్ సీఈఓ అదార్ పూనావాలా పేర్కొన్నారు.

బ్రిటన్ లో ఓ స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటై క్లినికల్ ట్రయల్స్ పై విచారణ జరిపింది.దర్యాప్తులో వ్యాక్సిన్ భద్రమేనని పేర్కొనడంతో ప్రయోగాలు మళ్లీ ప్రారంభించుకునేలా మెడిసన్స్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీకి కమిటీ సిఫారసు చేసింది.

దీంతో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది.భారత్ కు చెందిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయడంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించనుంది.

అయితే క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి స్క్రీనింగ్ సమయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి సమాచారాన్ని డీసీజీఐకు అందజేయాలని సంస్థ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube