ఇండియాలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ కి సిద్ధం

కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.ఈ పరిశోధనలలో చాలా వరకు పురోగతి దశలో ఉన్నాయి.

 Oxford Covid Vaccine Trials To Be Conducted In India, Corona Vaccine, Corona Eff-TeluguStop.com

హ్యూమన్ క్లినికల్ ట్రయిల్స్ కి సిద్ధం అవుతున్నాయి.ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్ ల క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి.

ఇండియాలో భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ట్రయిల్స్ దశలో ఉంది.అలాగే అన్నిటికంటే ముందు వరుసలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సమర్ధవంతవమైన స్టేజ్ లో ఉంది.

ఈ వ్యాక్సిన్ ని ప్రముఖ బయో ఫార్మా ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కి బ్రిటన్ లో క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి.

అయితే క్లినికల్ ట్రయల్స్ లో మానవులపై ప్రయోగించే క్రమంలో రెండు, మూడు దశలు ఎంతో కీలకమైనవి.ఇప్పుడా రెండు, మూడు దశల ప్రయోగాలను భారత్ లో నిర్వహించేందుకు ఆక్స్ ఫర్డ్ వర్సిటీ సిద్ధమైంది.

వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలతో భాగస్వామిగా ఉన్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజా క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరింది.ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంత సురక్షితమన్న అంశంతోపాటు, ఇది కలుగజేసే ఇమ్యూనిటీ స్థాయిని అంచనా వేసేందుకు పెద్దవాళ్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, అందుకు అనుమతించాలని కోరుతూ సీరమ్ ఇన్ స్టిట్యూట్ తన దరఖాస్తులో కోరింది.ఇక దీనికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది గనుక అభివృద్ధి చేస్తే ఇండియాలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందుతుందని సీరమ్ సంస్థ చెబుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube