ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేసి ఊరంతా....  

Ox Was Daied Villege Peoples Are Funeral At Uttarapradesh-

కొంతమందికి మూగజీవాలంటే ప్రాణం. తమ సొంత కుటుంభం సభ్యుల్లా వాటిని చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు..

ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేసి ఊరంతా.... -Ox Was Daied Villege Peoples Are Funeral At Uttarapradesh

అలాంటిది వాటికీ ఏమైనా అయితే తట్టుకోగలరా .? ఉత్తరప్రదేశ్‌ లోని ఖేరీ జిల్లాలోని నిఘాసన్ తహసీల్ పరిధిలో ఓ రైతు దగ్గర ఉండే ఎద్దు చనిపోవడంతో… ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేశాడు . బతికుండగా ఎద్దు ఎంతో కష్టపడిందని గుర్తించిన ఆ రైతు దానిని అంత్యక్రియలు చేసి రుణం తీర్చుకున్నట్లు తెలిపాడు.

బ్యాండ్ మేళాతో ఎద్దు మృతదేహాన్ని ఊరేగించి.తర్వాత సమాధి చేశారు.

అంతేనా … ఆ ఎద్దుకు గ్రామస్తులంతా సంతాపం ప్రకటించారు. అంతిమయాత్రలో గ్రామ ప్రజలంతా పాల్గొని నివాళులర్పించారు. సంతాప దినాలను ఘనంగా నిర్వహించి. 1000 మందికి భోజనాలు పెట్టాలని ఎద్దు యజమాని నిర్ణయించాడు. ఎద్దు మృతికి గుర్తుగా స్మారకస్థూపం నిర్మించేందుకు ఇప్పటికే గ్రామస్తులంతా రూ. 15 వేలను కలెక్ట్ చేశారు.