అనకాపల్లి ummalada గ్రామం లో సంక్రాంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు..

Ox Competitions Organized During Sankranti In Anakapalli Ummalada Village

గ్రామంలో మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయి ఎడ్ల బండి పోటీలు ఘనంగా నిర్వహించారు.గ్రామానికి చెందిన కర్రి మాధవరావు, కర్రీ భాస్కర్ రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల బండి పోటీలు ఏర్పాటు చేశారు.

 Ox Competitions Organized During Sankranti In Anakapalli Ummalada Village-TeluguStop.com

ఈ పోటీలో జిల్లా నలుమూలల నుండి సుమారు 30 వరకు ఎడ్లబండ్లు పాల్గొన్నాయి.ఎడ్లబండి పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసారు.

సందర్భంగా కర్రీ మాధవరావు మాట్లాడుతూ ummalada గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ పోటీల్లో ప్రథమ బహుమతిగా 12000,రెండో బహుమతి గా 10000 మూడో బహుమతి గా 8000 నాలుగో బహుమతి గా 6000ఇస్తున్నామని.

అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఎడ్లబండి 2000 ప్రత్యేక బహుమతిగా ఇస్తున్నట్టు తెలిపారు.

మన తెలుగు సాంప్రదాయాలను ఆచరిస్తూ సంక్రాంతి పండుగను అందరు జరుపుకోవాలని అందులో భాగంగానే తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఎడ్లబండి పోటీలను ఇక్కడ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు

.

#Ox Cart #Sankranthi #Ummalada #Andra Pradesh #Anakapalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube