వావ్.. ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందబ్బా..వీడియో వైరల్!

కొన్ని వీడియోలను చుస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.అసలు ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయా.

 Owner Ties Car With Ropes To Prevent It From Getting Swept Away In Telangana Flo-TeluguStop.com

ఇలా కూడా చేయవచ్చా.అనే అనుమానం కలుగకమానదు.

ఇలాంటి ఆశ్చర్య కలిగించే వీడియోలకు పెట్టింది పేరు మన సోషల్ మీడియాలో.ఇది ఒక అద్బుతమైన ప్లాట్ ఫార్మ్.

రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.మన దృష్టిలో కూడా పడుతుంది.

ఇక ఈ రోజు కూడా ఒక ఆశ్చర్యం కలిగించే వీడియో ఒకటి వైరల్ అయ్యింది.ఆ వీడియో గురించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాము.ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందంటే.ఈ ఘటన తెలంగాణాలో జరిగింది.

ఇక్కడ గత కొద్దీ రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.ఈ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రవాణా సదుపాయాలు నిలిచి పోవడమే కాకుండా వరద నీరు నిలిచి పోయింది.

ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల పట్టణంలో వరదలు రావడంతో అక్కడ రోడ్లపై నిలిచి ఉన్న వాహనాలు ఆ వరద నీటిలో కొట్టుకు పోయాయి.అయితే ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన కారు కూడా వరదలో కొట్టుకు పోకుండా ఆపడానికి ఒక ఐడియా వచ్చింది.ఆ ఐడియా వల్ల తన కారును కొట్టుకుపోకుండా కాపాడగలిగాడు.ఇంతకీ అతడికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా.

తన ఇంటి మీద ఉన్న పిల్లర్లకు తాడు కట్టి తన కారును వేలాడదీసాడు.ఈ ఐడియా తో తన కారు ఆ వరద నీటిలో కొట్టుకుపోలేదు.పక్కన ఉన్న వారు ఇతడి ఐడియా ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఇప్పుడు అది కాస్తా వైరల్ అయ్యింది.మీరు కూడా ఆ వీడియోను చూసి అతడి ఐడియా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube