పీక మీద కత్తి పెట్టి .. బట్టలు విప్పమని... వామ్మో !

తనను ప్రతిరోజు స్కూల్ కి తీసుకువెళ్తూ .తీసుకొస్తూ .

 Owner Daughter Dress Remove Warning On Driver With Knife-TeluguStop.com

తన సొంత అన్నలా నన్ను చూసుకుంటున్నాడు అని ఆమె అనుకొంది.అయితే అతడు మాత్రం అలా అనుకోలేదు.

లోపల వేరే ఉద్దేశం తో ఆమె మీద కన్ను వేసాడు.అదుముకోసం చూస్తున్నాడు.

ఈ సమయంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.చెప్పినట్టు వినకపోతే పెంపుడు శునకాన్ని, తల్లిదండ్రులను చంపేస్తానంటూ వీడియో కాల్‌ చేసి అసభ్యకరమైన దృశ్యాలను చిత్రీకరించాడు.

ఈ విషయాల గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరిస్తున్న డ్రైవర్‌పై బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నగరానికి చెందిన బాలిక ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.ఆమె ఇంట్లో షేక్‌ ఇస్మాయిల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఆమెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు.ఈ నెల 2వ తేదీన ఆమె ఇంట్లో ఉండగా వీడియో కాల్‌ చేశాడు.

పెంపుడు కుక్క గొంతు వద్ద కత్తి పెట్టి దుస్తులు తీసేయాలని ఆదేశించాడు.లేదంటే శునకాన్ని చంపేస్తానని బెదిరించడంతో అతడు చెప్పినట్టు చేసింది.

కుమార్తె ముభావంగా ఉండటం గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా విషయం చెప్పింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube