ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే ప్రజల్లో కనిపిస్తోంది.ఈ మహమ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో అర్థంగాక ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఈ కరోనా భూతం నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.అయినప్పటికీ.
ప్రపంచదేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా వ్యాప్తిలో జోరు తగ్గడం లేదు.రోజురోజుకు మరింత వేగంగా విజృంభిస్తోంది.
ఈ ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.దీనిని అధిగమించడం పెద్ద సవాల్‌గా మారింది.ఇదిలా ఉంటే.రోజురోజుకు కరోనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.
సాధారణంగా చాలా మంది ఏ నొప్పి వచ్చినా.సొంత వైద్యమే చేసుకుంటూ నయం చేసుకుంటారు.
అయితే ఇప్పుడు కరోనాకు కూడా చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.
తమకు కరోనా అని తెలియగానే.కరోనా వచ్చిన సన్నిహితులకు ఫోన్ చేసి.
వారు వాడుతున్న మందుల్నే వాడుతున్నారట.అయితే నిపుణులు ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.కరోనా సోకిన ఏ ఇద్దరికి ఒకేలాంటి వైద్యం చేయరని.
వారికున్న లక్షణాల ఆధారంగా మెడిసిన్ ఇస్తారని చెబుతున్నారు.
అందుకే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా.
కరోనా సోకిన రోగులకు ఫోన్ చేసి, వారు వాడిన మందులు వాడటం చాలా డేంజర్ గా సూచిస్తున్నారు.అలాగే ఫార్మసీ సిబ్బందికి కూడా కరోనా మందులపై అవగాహన లేదని చెబుతున్నారు.
కాబట్టి, కరోనా సోకితే.వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన వైద్యం తీసుకోమని సూచిస్తున్నారు.