అతిగా నిద్రపోతున్నారా.? అయితే ఏ క్షణంలోయినా చనిపోవచ్చు అంట.?  

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెప్పినట్టు నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర రెండు మంచి మొగుడు. తనకే కాదు చాలా మందికి నిద్ర అంటే చాలా ఇష్టం. నిద్రపోవటం కంటే సుఖం ఇంకెందులో ఉండదు అనుకుంటారు. అయితే ప్రియులకు ఇది తాజా హెచ్చరిక.

-

అతి నిద్ర ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఎనిమిది గంటలు మించి నిద్రపోతూ ఉంటే వారు ఏక్షణమైనా సమస్యల వలయంలో చిక్కుకోవచ్చని సెలవిస్తున్నారు. వీరికి గుండెపోటు వచ్చేందుకు 146శాతం అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు మాత్రం జీవితాంతం ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోకుండా హాయిగా బతికేయొచ్చని కూడా వారు సెలవిస్తున్నారు.

ఇప్పటి వరకు అత్యంత ప్రాణాలు హరించే వాటిల్లో తొలి రెండు స్థానాల్లో గుండెపోటు, క్యాన్సర్ ఉండగా దాని అనంతరం కూడా అతి నిద్ర వల్ల వచ్చే గుండె పోటేనని చెప్తున్నారు. ప్రతి ఏడాది బ్రిటన్ లో దాదాపు లక్షమంది గుండెపోటుకు గురవుతుండగా వీరిలో సగానికిపైగా అతి నిద్రకు అలవాటైన వారే ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనను అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అధ్యయనకారులు చేశారు.

-

ఎంతలేదన్నా కనీసం రోజుకు 30 నుంచి 60 నిమిషాలపాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి సురక్షితం అని చెప్పారు. సో అతిగా నిద్రపోయే వారిని తట్టిలేపేలా షేర్ చేయండి. మన మిత్రులు, సన్నిహితులు నాలుగు కాలాలపాటు బతికేందుకు అవగాహన కల్పించండి..