ఇప్పట్లో ఓవర్‌ సీస్‌ బిజినెస్‌పై ఆశ పెట్టుకోవద్దు

తెలుగు సినిమాలకు మరో నైజాం ఏరియాగా మారిపోయిన ఓవర్ సీస్‌ కరోనా దెబ్బకు మళ్లీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.అప్పట్లో అమెరికాతో పాటు పలు దేశాల్లో తెలుగు సినిమాలను విపరీతంగా చూసేవారు.

 Overseas Movie Business Not Started Very Soon , Corona, Corona Effects On Telugu-TeluguStop.com

కాని ఇప్పుడు అక్కడ సినిమాలను స్క్రీనింగ్‌కు చాలా పెద్ద వ్యవహారంగా మారిపోయింది.తెలుగు సినిమాలను అక్కడ విడుదల చేసేందుకు ఇప్పట్లో వీలు పడదని అంటున్నారు.

తెలుగు సినిమాలు ఎక్కువగా విడుదల అయ్యే స్క్రీన్‌ ల్లో టికెట్‌ రేటు పెంచారు.సీట్ల కెపాసిటీ తగ్గించడం వల్ల టికెట్ల రేట్లను పెంచడం జరిగింది.

తెలుగు సినిమాలను భారీ మొత్తానికి కొనుగోలు చేసి చూడటం అక్కడ కాస్త అనుమానమే అనిపిస్తుంది.ఇక్కడ సినిమాలు విడుదల ఆరంభం అయినా కూడా అమెరికాలో మన సినిమాలు స్క్రీనింగ్‌ అవ్వడం మాత్రం అనుమానమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోలు అక్కడ భారీ వసూళ్లను రాబడుతున్నారు.బాహుబలి సినిమా అమెరికాలో భారీ వసూళ్లను నమోదు చేసింది.నైజాం ఏరియాలో కన్నా కూడా కొన్ని సినిమాలు ఓవర్సీస్‌లో వసూళ్లు చేసిన సందర్బాలు ఉన్నాయి.అంతటి ప్రాముఖ్యత ఉన్న ఓవర్సీస్‌ ఇప్పట్లో ఓపెన్‌ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఓవర్సీస్‌ బిజినెస్‌ ను నమ్ముకున్న వారు అంతా కూడా తమ సినిమాలను వచ్చే సమ్మర్‌ వరకు వాయిదా వేసుకోవాల్సిందే అంటున్నారు.సమ్మర్ తర్వాత అయినా వ్యాక్సిన్‌ వచ్చి పూర్తి స్థాయిలో వైరస్‌ తగ్గుముఖం పడితే అప్పుడు కాని అప్పుడు అక్కడ నుండి ఆఫర్లు వస్తాయని అంటున్నారు.

మొత్తానికి కరోనా మొత్తం ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తుంది అనడంలో సందేహం లేదు.తెలుగు సినిమాలు సంక్రాంతి సీజన్‌ నుండి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.

ఈనేపథ్యంలో ఓవర్సీస్‌ లో విడుదల అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube