బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి చేరిస్తే.. ఈజీగా బ‌రువు త‌గ్గొచ్చు!!

Over Weight Fitness Tips Health Tips

ఇటీవ‌ల కాలంలో చాలా మందిని అధిక బ‌రువు స‌మ‌స్య వేధిస్తోంది.ఈ స‌మ‌స్య‌ ఉన్న వారు బరువు తగ్గేందుకు పడేపాట్లు అన్నీఇన్నీ కావు.

 Over Weight Fitness Tips Health Tips-TeluguStop.com

ఆహారం, జీవ‌న‌శైలి, వృత్తి ఉద్యోగాల ప్రభావంతో అమాంతం బ‌రువు పెరుగుతుంటారు.ఇలాంటి వారు ఎంతటి డైట్ మొయింటెన్ చేసినా బరువు తగ్గడంలో మాత్రం విఫలమౌతుంటారు.

ఆహారమార్పులు, ఎక్సర్‌సైజ్‌లు, యోగాసనాలు ఇలా ప్రతిఒక్కటిని పాటిస్తారు.

 Over Weight Fitness Tips Health Tips-బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి చేరిస్తే.. ఈజీగా బ‌రువు త‌గ్గొచ్చు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా అనుకున్న ఫలితం రాక ఆవేదన చెందుతుంటారు.

వాస్త‌వానికి అధిక బ‌రువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.ముఖ్యంగా మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే.అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌డంతో పాటు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

బ‌రువు తగ్గటానికి చేయాల్సిన మొదట పని ఆహారంలో మార్పు.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.

మీ మార్నింగ్‌ని గ్రీన్ జ్యూస్‌తో ప్రారంభించండి.అంటే ఆకుపచ్చ కూరగాయ, కొన్ని ఆకులను గ్రీన్ జ్యూస్ రూపంలో త‌యారు చేసుకుని తీసుకోవాలి.అలాగే మీ బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజు యొక్క ముఖ్యమైన ఆహారం.బ్రేక్ఫాస్ట్‌లో ఎం తీసుకుంటారో అది మీ రోజంతా ప్రభావితం చేస్తుంది.

అందుకే మీ బ్రేక్ఫాస్ట్‌లో తాజా పండ్లు మ‌రియు న‌ట్స్‌తో నింపుకోవాలి.ముఖ్యంగా నాన‌బెట్టిన బాదం, జీడిప‌ప్పు, కిస్‌మిస్‌, వాల్‌న‌ట్స్ వంటివి తీసుకోవాలి.

ఇక పండ్ల విష‌యానికి వ‌స్తే.బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్‌, అరటిపండు ఇలా తాజా పండ్ల‌ను చేర్చుకోవాలి.

సహజసిద్ధంగానే ఎన్నో ఆరోగ్య లాభాలను నింపుకుని ఉండే పళ్లు బరువు తగ్గేందుకు కూడా సాయపడతాయి.పళ్లలో అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది.

సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి.ఇవి ఆకలికి అడ్డుకట్ట వేస్తాయి.

అధిక బరువుని త‌గ్గిస్తాయి.అయిల్‌తో త‌యారు చేసిన ఫుడ్‌ను బ్రేక్ఫాస్ట్‌లో అస్స‌ల తీసుకోరాదు.

ఇక‌ పంచ‌దార‌తో త‌యారు చేసే ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి.నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.

రోజుకు క‌నీసం అరగంట వ్యాయామం చేయండి.శాండ్‌విచ్, బర్గర్, నూడుల్స్ లాంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ఈ టిప్స్ ఫాలో అయితే ఖ‌చ్చితంగా బ‌రువు త‌గ్గొచ్చు.

#Fitness Tips #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube