హెచ్చరిక: శానిటైజర్లు అతిగా వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే!

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ను ఎదర్కొనేందుకు మనకు సహాయపడేది శానిటైజర్.అందుకే బయటకు వెళ్లి వచ్చిన.

 Over Use Of Sanitizers, Harm To Skin, Ministry Of Health, Covid-19, Corona Virus-TeluguStop.com

బయటవాళ్ళు ఎవరైనా తాకినా, చివరికి బాత్ రూమ్ కి వెళ్లిన శానిటైజర్ ఉపయోగిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి.ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

శుభ్రత పాటించడం మంచి అలవాటు అయినప్పటికీ మితిమీరిన శానిటైజర్ల వాడకం మాత్రం మంచిది కాదని వైద్యారోగ్య మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్ ఆర్‌కే వర్మ తెలిపారు.శానిటైజర్ బదులుగా ఎక్కువ సార్లు సబ్బుతో కడుక్కోవడం మంచిదని సూచించారు.

కాగా శానిటైజర్లు ఎక్కువగా వాడడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాను కూడా నశిస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే.

డాక్టర్ ఆర్‌కే వర్మ మాట్లాడుతూ ”ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎవరూ ఊహించనివి, ఒక వైరస్ మానవాళిపై ఇంతలా విరుచుకుపడుతుందని ఏనాడూ అనుకోలేదు.ఎవరికివారు తమను తాము రక్షించుకోవడం కోసం తప్పకుండా ముఖానికి మాస్కు ధరించండి.తరచూ వేడి నీటినే తాగండి.

చేతులను సబ్బుతోనే శుభ్రం చేసుకోండి.కానీ, శానిటైజర్లను అతిగా వాడకండి” అంటూ అయన సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube