అమెరికాలో 3 లక్షల మరణాలు..ఫౌసీ సంచలన వ్యాఖ్యలు..!!  

అగ్ర రాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మహమ్మారి కరోనా.రోజు రోజుకి అమెరికాలో కేసులు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో అధికారులలో అలజడి మొదలయ్యింది.

TeluguStop.com - Over Three Lakhs Corona Deaths Anthony Fauci

అధికారంలోకి వచ్చామనే సంతోషం వచ్చి సంతోష పడిన కాస్తలోనే కరోనా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో కంటి మీద కునుకు ఉంటడం లేదు అధికార డెమోక్రటిక్ పార్టీకి.ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖా అధికారులు తాజాగా పరిణామాలతో తలలు పట్టుకుంటున్నారు.


TeluguStop.com - అమెరికాలో 3 లక్షల మరణాలు..ఫౌసీ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమెరికాలో కరోనా కేసులు ఉదృతం అవుతున్న నేపధ్యంలోనే అమెరికా అంటువ్యాధుల నిపుణులు, ప్రముఖ వైద్యుడు అంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో ప్రస్తుతం కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2.5 లక్షలకు చేరుకుందని, కానీ ఇదే పరిస్థితి గనుకా కొనసాగితే త్వరలో అంటే ఈ ఏడాది చివరికి మృతుల సంఖ్య 3 లక్షలు చేరుకుంటుందని హెచ్చరించారు.ప్రతీ రోజు అమెరికాలో కరోనా కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య 2 వేలు దాటుతోందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని అంటున్నారు పౌసీ…అయితే


ఈ పరిస్థితుల నుంచీ అమెరికన్స్ బయట పడటానికి ఒకేఒక్క మార్గం ఉందని, అమెరికాకు ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చే సత్తా ఉందని.

కానీ అమెరికన్స్ ఎంతో భాద్యతతో ఉంటేనే తప్ప అది సాద్యం కాదని తెలిపారు.బయటకి వెళ్ళే తప్పుడు తప్పకుండా మాస్క్ ధరించి మాత్రమే వెళ్లాలని, సామాజిక దూరం పాటించాలని కేవలం దీని ద్వారా మాత్రమే మనల్ని మనం కరోనా మహమ్మారి నుంచీ కాపాడుకోగలమని తెలిపారు.

#America #Second Wave #Corona Deaths #DoctorAnthony #COVID Pandemic

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు