వయాగ్రా ఓవర్‌ డోస్‌తో కంటి చూపు పోయే అవకాశం... వాడేవారు ఇది తప్పక చదవాలి

లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో వాడే ఔషదం వయాగ్రా.ఎంతో మందికి ఇది ఉపయోగదాయకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Over Dosage Of Viagra May Leads To Blind-TeluguStop.com

ముఖ్యంగా అయిదు పదుల వయసు దాటిన వారు దీన్ని ఎక్కువగా వాడుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడయ్యింది.పెద్ద ఎత్తున వయాగ్రా వాడుతున్న దేశాల్లో మన దేశం కూడా ఉంది.

ఇతర దేశాల్లో కూడా వయాగ్రా వినియోగం పెద్ద ఎత్తున ఉంటున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

వయాగ్రా ఎక్కువగా వాడితే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వయసును బట్టి, వారి లైంగిక సామర్థ్యంను బట్టి వయాగ్రా డోస్‌ను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.వయాగ్రా డోసు మరీ శృతి మించితే మాత్రం ప్రమాదం తప్పదని వైధ్యులు మొదటి నుండి చెబుతున్నారు.

మానసిక మరియు శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వయాగ్రాను కాస్త తక్కువ తీసుకుంటేనే ఉత్తమం అనేది చాలా మంది ప్రముఖులు చెబుతున్న మాట.

వయాగ్రా వల్ల కంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని తాజాగా ఒక వ్యక్తి విషయంలో నిరూపితం అయ్యింది.కొన్నాళ్ల నుండి అధిక మోతాదులో వయాగ్రా వాడుతున్న ఆ వ్యక్తికి కంటి సమస్య ఏర్పడింది.అతడు కేవలం ఎరుపు రంగును మాత్రమే చూడగలుగుతున్నాడు.

చుట్టు ఉన్న ప్రపంచంమొత్తం కూడా అతడికి ఎర్రగానే కనిపిస్తుంది.అతడు మరి కొద్ది రోజుల్లోనే పూర్తిగా కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అమెరికాకు చెందిన ఆ వ్యక్తిపై ప్రస్తుతం పరిశోదనలు జరుగుతున్నాయి.అతడికి తిరిగి కంటి చూపు సరి చేయడం కోసం వైధ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.కాని వారి ప్రయత్నాలు సఫలం అయ్యేలా కనిపించడం లేదు అంటూ అంటున్నారు.వయాగ్రా అమితంగా వాడటం వల్లే అతడి కంటి నరాలు దెబ్బ తినడంతో పాటు, రెటీనాపై ప్రభావం పడిందని వెళ్లడయ్యింది.

అతడి కళ్లకు సమస్య తప్ప మిగిలిన అంతా కూడా బాగానే ఉందని వైధ్యులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube