'మజిలీ' టీం ఓవర్‌ కాన్ఫిడెన్సా?

అక్కినేని జంట నాగచైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం విడుదలకు వారం రోజుల సమయం కూడా లేదు.కాని ఈ సమయంలో ఇంకా మజిలీ గురించి ప్రచారం భారీగా జరుగుతున్నట్లే అనిపించడం లేదు.

 Over Confidence Of Majili Team-TeluguStop.com

ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఉన్న నేపథ్యంలో మరో వైపు ఈ చిత్రంకు భారీ ఎత్తున్న ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదల చేయడమే తప్పు, అలాంటిది సినిమాకు ప్రమోషన్‌ చేయకుండా నేరుగా సినిమాను విడుదల చేయడం అనేది చాలా పెద్ద తప్పుగా అంతా భావిస్తున్నారు.

మజిలీ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.అన్ని ఏరియాల్లో కూడా మంచి రేటుకు అమ్మేశారు.సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్న కారణంగా సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదు అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.మజిలీ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అక్కినేని జంట గత వారం రోజులుగా వెంకటేష్‌ కూతురు పెళ్లిలో హడావుడి చేస్తున్నారు.

నిన్నటికి అశ్రిత పెళ్లి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.అయినా కూడా ఇంకా మీడియా ముందుకు మజిలీ చిత్రం కోసం నాగచైతన్య కాని సమంత కాని రావడం లేదు.ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరుపబోతున్నారు.ఆ వేడుక కోసం కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు.ప్రీ రిలీజ్‌ వేడుక పబ్లిసిటీ కూడా జరగడం లేదు.ఇందతా కూడా చూస్తుంటే సినిమాపై చిత్ర యూనిట్‌ సభ్యులకు మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఎంత కాన్ఫిడెన్స్‌ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రమోషన్స్‌ అనేవి చేయాలి.అలా చేస్తేనే సినిమా సక్సెస్‌ అవుతుందనే విషయం వారు గుర్తించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube