జగన్ కేసు కూడా ఉందా?

ఇవి కోర్టుల్లో కేసులు కాదు.దేశంలోని అతి ఉన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులు.

 Over 1,100 Cases Under Cbi Investigation-TeluguStop.com

సీబీఐ వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఈ కేసులన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

జూన్ నెలాఖరు నాటికి ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తమకు సమాచారం ఉన్నదని కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ రాజ్య సభలో చెప్పారు.నిబంధనల ప్రకారం ఈ కేసుల దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.

కొన్ని కేసులు చాలా జటిలంగా ఉన్నాయని,అనేక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారని చెప్పారు.కొన్ని కేసుల్లో ఎక్కువమంది సాక్షులను విచారించాల్సి ఉంది.

అనేకమంది నిపుణులతో మాట్లాడాల్సి ఉంది.కేసుల విచారణకు కాలపరిమితి ఏమీ లేదు.

కేసు స్వభావాన్ని బట్టి విచారణ సాగుతుంది.ఉన్నత దర్యాప్తు సంస్థకు కూడా సిబ్బంది కొరత ఉంది.

కొన్ని కేసుల విచారణలో ఇతర రాష్ట్రాల అధికారులను వాడుకుంటున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కేసు దర్యాప్తుకు లక్ష్మీనారాయణను మహారాష్ట్ర నుంచి రప్పించారు.

ఆయనే జగన్ను జైలుకు పంపారు.పెండింగ్ కేసుల్లో జగన్ కేసు కూడా ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube