వైరల్ వీడియో: రోడ్డుమీద చెత్తను పడేసిన మహిళకు బుద్ది చెప్పడానికి ఆ యువతి చేసిన పనికి సూపర్ అని మెచ్చుకుంటారు..ఏం చేసిందంటే.!

చైనాలోని బీజింగ్‌లో ఓ యువతి చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది.ఆ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ యువతిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

 Outraged Biker Throws Woman Drivers Rubbish Back Into Car-TeluguStop.com

ఇంతకీ ఏం జరిగింది.అంటే బీజింగ్‌లోని ఓ రోడ్డు మీద సిగ్నల్ పడినప్పుడు కారు ఆగింది.

కారులో వెళ్తున్న మహిళ అక్కడ ఒక చెత్త కవర్ ని బయటికి విసిరేసింది.ఈ ఘటన అంతా వెనుక ఉన్న కార్ డ్యాష్ బోర్డులోని కెమెరాలో రికార్డయింది.

అయితే అప్పుడే బైక్ మీద అటువైపుగా వచ్చిన ఒక యువతి .ఆ చెత్త బ్యాగ్ ను చూసింది.చూసి ఏం చేసిందో ఒకసారి గెస్ చేయండి.

మనకెందుకులే అని వెళ్లిపోయిందా అని అడుగుతారా…కాదు.మరీ.కార్లో ఉన్నావిడతో గొడవపెట్టుకుందా.కాదూ మరేం చేసిందంటే.

ఆ చెత్త బ్యాగ్ తీసి చెత్త బుట్టలో వేసిందా.చాలా మంది ఇలాగే చేస్తారు.

కానీ మన అమ్మడు చాలా గడుసుది అనుకుంటా.ఆ చెత్తను తీసి అదే కారులో విసిరేసింది.

వెంటనే సిగ్నల్ పడగానే వెనక్కి చూడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది.

హమ్మయ్య కారులో చెత్త బయటపడేసా అనుకున్న ఆ మహిళ మళ్లీ కారులోకి చెత్తను విసిరేయడంతో మొదట విస్తుపోయింది.వెంటనే చిర్రెత్తుకొచ్చి…కోపంతో డోర్ తీసి ఆ యువతిని ఆపబోయింది.కానీ.

అప్పటికే ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది .బాగా బుద్ది చెప్పింది అంటూ అందరూ ఆ యువతిని మెచ్చుకుంటున్నారు.మీరూ ఆ వీడియో చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube