మాస్క్ వేసుకోలేదని జవాన్ పై పోలీసుల దుశ్చర్య

బోర్డర్ లో ఉంటూ దేశానికి కాపలా కాసే సైనికుల విషయంలో అప్పుడప్పుడు పోలీసులు వ్యవహరించే తీరు సంచలనంగా మారుతున్నాయి.తెలంగాణలో ఒక జవాన్ పై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.

 Outrage Over Crpf Jawan In Chains At Karnataka Police, Lock Down, Corona Effect,-TeluguStop.com

అయితే ఈ ఘటన మరిచిపోకముందే కర్ణాటకలో ఓ గ్రామంలో సిఆర్పీఎఫ్ జవాన్ ఇంటి దగ్గర మాస్క్ వేసుకోలేదని ఒక కారణంతో విచాక్షనారితంగా దాడి చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి ఒక ఖైదీకి వేసినట్లు సంకెళ్ళు వేశారు.దీనిపై సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

కర్ణాటక దీజేపీకి లేఖ రాసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళంలో సచిన్‌ సావంత్‌ జవాన్‌గా పనిచేస్తున్నాడు.

అతడి స్వస్థలం కర్ణాటకలోని ఎగ్జాంబా గ్రామం.ప్రస్తుతం సెలవులో ఉన్నాడు.23న సావంత్‌ తన ఇంటి ముందు బైక్‌ను క్లీన్‌చేస్తుండగా పోలీసులు అటుగా వచ్చారు.లాక్‌డౌన్‌ అమల్లో ఉంది, ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు.

అంతేకాకుండా మాస్కు ఎందుకు ధరించలేదని నిలదీశారు.సావంత్‌ కూడా గట్టిగా బదులిచ్చారు.

దీంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డారు.చేతికి బేడీలు వేశారు.

పోలీసు స్టేషన్‌కు తరలించారు.లాకప్‌లో గొలుసులతో బంధించారు.

అతడిపై కేసు నమోదు చేశారు.ఈ దృశ్యాలన్నీ స్థానికుడొకరు తన సెల్‌ఫోన్‌లో బంధించాడు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది.దీనిపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక జవాన్ పై ఇంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తారా అంటూ కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నించారు.

వారి లేఖపై దీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube