స్మితా సబర్వాల్ కేసులో వింత తీర్పు

అవుట్ లుక్ మాగజైన్ తో గత సంవత్సరం మొదలైన తెలంగాణా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేసు ఇంకా సాగుతూనే ఉంది.ఇందులో ఆశ్చర్యకరమైన తీర్పు ఇప్పుడు వెలువడడం తో అంతా దీని గురించే చర్చించుకుంటూ ఉన్న్తారు.

 Outlook Gets Relief In Smitha Sabarwal Case-TeluguStop.com

అవుట్ లుక్ మాగజైన్ వారు పోయిన సంవత్సరం ఆమె మీద ఒక కార్టూన్ వేసి వార్తా కథనాన్ని అసభ్యంగా రాసారు అనేది ఆమె ఆరోపణ కాగా ఆమెని కించ పరిచారు అనేది తెలంగాణా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఆమెకి బాసటగా నిలిచింది.ఆ పత్రిక వారు ఈ విషయంలో తరవాత క్షమాపణ చెప్పినా ఆమె శాంతించలేదు.

ఆమెకు తెలంగాణ సర్కారు దన్నుగా నిలిచింది! ఆమె కోర్టు ఫీజులకు గానూ లక్షల రూపాయల డబ్బును కూడా విడుదల చేస్తూ జీవోను ఇచ్చింది ప్రభుత్వం!మరి అప్పట్లో ఆ లొల్లి జరగగా… ఇప్పుడు ఆ వ్యవహారం నుంచి ఔట్ లుక్ బయటపడింది.ఈ కేసు విచారణార్హం కాదని కోర్టు తీర్పునిచ్చింది.

ఎందుకంటే.దాన్ని స్మితా సబర్వాల్ దాఖలు చేయలేదని, ఆమె భర్త అకున్ సబర్వాల్ దాఖలు చేశాడని.

అందుకే ఇది విచారణార్హం కాదని తేల్చారు.దీంతో ఔట్ లుక్ కు ఊరట లభించింది! భార్య కి అవమానం జరిగితే భర్త ఫిర్యాదు చెయ్యకూడదు అనే కొత్త నిభందన ఏంటో అంటూ అంతా తల బాదుకుంటున్నారు.

ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ జీవోను కూడా ఇచ్చింది కదా…మరిఫిర్యాదు ఆమె పేరుతో కాకుండా, అకున్ పేరుతో ఎలా దాఖలైందో!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube