ఆ ఒక్క టీవీతో... ఊర్లో ఎవరికీ ఇంటర్నెట్ లేదు...?!

ప్రస్తుత సమాజంలో టీవీ అంటే తెలియని వారంటూ ఉండరు.సామాన్యుడి ఇంట్లో కూడా టీవీ ఉంటుంది.

 Old Tv Breaks Internet In Entire Village, Old Tv Signals, Internet, Work From Ho-TeluguStop.com

ఇప్పుడు ఉన్న సమాజంలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేని వారంటూ ఉండరు.టెక్నాలజీ పెరిగేకొద్దీ టీవీలలోను చాల మార్పులు వచ్చాయి.

డబ్బా టీవీ నుండి ఇంటర్నెట్ టీవీ వరకు అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే.ఇక దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో చాల కంపెనీలకు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చిన సంగతి విదితమే.

ఈ క్లిష్ట సమయంలో చాల మంది మొబైల్ డాటాతో లాప్ కి కనెక్ట్ చేసుకొని నానా అవస్థలు పడుతూ పని చేయలేక కొంత మంది డేటా కనెక్షన్స్ పెట్టించుకున్నారు.అయితే ఓ ఊరిలో టీవీ కారణంగా ఇంటర్నెట్ రావడం లేదు.

అయితే ఫస్ట్ వాళ్ళు నెట్ రాకపోవడానికి ఏవేవో కారణాలు ఊహించుకున్నారు.చాల రోజుల వరకు ఇంటర్నెట్ ఎందుకు రావడం లేదో ఎవరికీ అర్థంకాలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.బ్రిటన్‌లోని వేల్స్ పరిధిలోని అబెర్హోసన్ గ్రామంలో ప్రతి ఇంటికి నెట్ కనెక్షన్స్ ఉన్నాయి.అయితే ఆ గ్రామంలో 18 నెలలుగా ఇంటర్నెట్ రావడం లేదు.అయితే నెట్ ఎందుకు రావడం లేదో అని చాల మంది టెక్నీషియన్లు సమస్య ఏంటో కనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశారు.

ఇక ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ కి సంబంధించిన వైర్లు, ప్లగ్గులు, పిన్నులు, డివైజ్ లు అన్ని చేంజ్ చేశారు.అయినా సమస్యకు కారణం ఏంటో వారికీ దొరకలేదు.
అయితే ఇటీవల కాలంలో ఆ సమస్యకు కారణం తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.అయితే ఆ ప్రాంతంలో పాతాకాలానికి చెందిన సెకండ్ హ్యాండ్ డొక్కు టీవీకి వచ్చే సిగ్నల్స్ కారణంగానే ఇంటర్నెట్ కి సిగ్నల్ రావడంలేదని ఓ ఇంజినీర్ వెల్లడించారు.

ఇక సింగిల్ హైలెవెల్ ఇంపల్స్ నాయిస్ ఎలక్ట్రికల్ సిగ్నళ్ల వల్లనే ఇంటర్నెట్ రాకుండా చేస్తుందని ఆయన తెలిపారు.ఇక ఆ టీవీ యాజమాని టీవీ చూసినప్పుడు నెట్ కట్ అవుతుందని, టీవీ ఆఫ్ చేసినపుడు నెట్ వస్తుందని ఆయన వెల్లడించారు.

దీంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలంతా టీవీని శాశ్వతంగా బంద్ చేయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube