విరాట్ డకౌట్ ను బలే వాడేసుకున్నారుగా మన పోలీసులు..!

ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాని విపరీతం గా వాడేస్తున్నారు.ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలబ్రెటీలను సైతం వదిలి పెట్టకుండా వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

 Our-police Allegedly Used Virat Duckout As A Scapegoat Sports, Virat Kohili, Dak-TeluguStop.com

మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రజనీకాంత్ డైలాగ్ లను వాడి ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే వారి వార్నింగ్ ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ అధికారులు సెలబ్రెటీలను వాడుకోవడంలో ముందంజలో ఉంటారు.అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్ పోలీసులు కూడా ఇదే తరహాలో సెలబ్రెటీలను వాడుకొని వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెరిగేలా చేస్తున్నారు.

తాజాగా ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటో ని వాడుకొని హెల్మెట్ ఉపయోగం తో పాటు రోడ్లపై ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలా చక్కగా వివరించారు.ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డక్ ఔట్ అయిన విషయం తెలిసిందే.

ఒక్క రన్ కూడా చేయకుండా అవుట్ అయిన విరాట్ కోహ్లీ పై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి.ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఔట్ గురించే క్రికెట్ లవర్స్ మాట్లాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కోహ్లీ ఫోటో ని వాడుకోవాలని నిర్ణయించుకుంది.

హెల్మెట్ ధరించి వాహనం నడిపితే చాలదు పూర్తి స్పృహతో వాహనం నడపాలి.

లేకపోతే హెల్మెట్ పెట్టుకున్న విరాట్ కోహ్లీ వలే మీరు కూడా డక్ అవుట్ అవుతారు అని ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక పోస్ట్ పెట్టారు.అయితే ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ పేజీపై విరాట్ కోహ్లీ ఫోటో దర్శనం ఇవ్వగానే నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

అలాగే ఈ పోస్ట్ ని ఉత్తరాఖండ్ నెటిజన్లు బాగా వైరల్ చేశారు.దీంతో ఈ పోస్ట్ కి వేలల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube