ఇత‌ర దేశాల నుంచి డ‌బ్బులు పంపుతున్నవారిలో మ‌నోళ్లే ఫ‌స్ట్‌..

ఇండియాలో ఉన్నంత మంది యువ‌కులు ప్ర‌పంచంలో ఎక్క‌డా లేరు.ఇదే మ‌న దేశానికి పెద్ద లాభాన్ని చేక్చూర్చుతోంది.

 Our People First Among Those Sending Money From Other Countries Ther Countries M-TeluguStop.com

ఎందుకంటే క‌స్ట‌ప‌డి సంపాదించే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటే సంపాద‌న పెరుగుతుంది క‌దా.జ‌నాభా ప‌రంగా కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తున్నా కూడా సంపాదించే మార్గంలో మాత్రం ఇండియాకు ఎన్నో లాభాలు వ‌స్తున్నాయి.

మ‌న దేశంలో ఇంత‌మందికి ప‌ని ఇప్పించ‌డం అంటే పెద్ద స‌వాల్‌.అందుకే యూత్‌లో ఎక్కువ‌మంది విదేశాల బాట ప‌డుతున్నారు.

అక్క‌డే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఇండియాకు డ‌బ్బులు పంపిస్తున్నారు.

నిజానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలా అన్ని దేశాల నుంచి ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్లి అక్క‌డ డ‌బ్బులు సంపాదిస్తూ స్వదేశానికి పంపిస్తుంటారు.

ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది ఇలాగే బ‌య‌టి దేశాల నుంచి పెద్ద ఎత్తున డ‌బ్బులు పంపిస్తున్నారు.ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా విదేశాల నుంచి డ‌బ్బులు పంపే దేశాల్లో మ‌న ఇండియానే ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉందంట‌.

ఇదే విష‌యాన్ని ప్ర‌పంచ బ్యాంక్ వెల్ల‌డించింది.ఇండియా మొద‌టి స్థానంలో ఉంటే త‌ర్వాత చైనా, మెక్సికో, ఫిలిప్ఫైన్స్, ఈజిప్టు లాంటివి ఉన్నాయ‌ని ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక‌లో వెల్ల‌డించింది.

Telugu America, China, Place India, Maxico, India, Bank-Latest News - Telugu

ఇండియా నుంచి అధిక‌మంది విదేశాల్లో ఉంటున్నార‌ని, వారే ఇలా డ‌బ్బులు పంపిస్తున్నారంటూ వాషింగ్టన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ప్ర‌పంచ బ్యాంక్ వివ‌రాల‌ను వెల్ల‌డించిది.ఈ ఏడాదిలోనే 87 బిలియన్ డాలర్ల నిధులు మ‌న ఇండియాకు చేరాయ‌ని చెప్పింది.ఇక పోయినేడాది 83 బిలియన్ డాలర్ల సంపాద‌న ఇండియాకు వ‌చ్చింద‌ని నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.అయితే ఇలా బ‌య‌టి దేశాల నుంచి వ‌స్తున్న నిధుల్లో 20 శాతం దాకా అమెరికా నుంచే వ‌స్తోందంటూ చెప్ప‌డం విశేషం.

అమెరికాలో ఎక్కువ‌గా ఇండియ‌న్లు ఉన్నార‌ని, వారి నుంచే అధిక సంపాద‌న వ‌స్తోంద‌ని తెలిపింది.అంటే డాల‌ర్ల సంపాద‌న ఎక్కువ‌గా ఉంద‌న్న మాట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube