తెనాలి ని జిల్లా చేసి వేమూరు నియోజకవర్గన్నీ తెనాలి క్రింద ఉంచాలని మా ప్రధాన డిమాండ్-మాజీమంత్రి నక్కా.ఆనంద్ బాబు

ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన ప్రక్రియ ఫాల్స్ గా తయారు అయినపరిస్థితి కనపడుతుంది.ఉద్యోగుల సమస్యలు,క్యాసినో జరిగిన ఆరోపణలు, ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణలు అన్ని పక్కదారి పట్టించటానికే అర్ధరాత్రి జీవో -జిల్లాల విభజన ప్రక్రియ జరిగినట్టు తెలుస్తోంది.

 Our Main Demand Is To Make Tenali A District And Keep All The Three Constituenci-TeluguStop.com

సహేతిక,హేతు బద్ధంగా జిల్లాల విభజన చెయ్యేటాన్ని పూర్తిగా వ్యతరేకిస్తున్నాము.జిల్లాలు విభజన చెయ్యాల్సిన అవసరం ఉంది అందుకు కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలు,అందరి వివరణ తీసుకొని ఎక్కడ సమస్యలు రాకుండా చెయ్యాలి తప్ప హడావిడిగా కాదు.

ప్రజల కోసం కాకుండా కులాల, మతాల మధ్య అలజడులు, విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకోటానికి చేసినట్టి ఉంది.

వేమూరు నియోజకవర్గం ప్రజలు కొన్ని దశాబ్దాలుగా సెంటిమెంట్ గా, భావోద్వేగాలతో,తెనాలి ప్రాంతంతో ముడి పడి ఉంది .ప్రతి రోజు వేమూరు నియోజకవర్గ ప్రజలు ఏమిపనులు ఉన్న తెనాలి పక్కనే ఉండటం వల్ల తెనాలి ప్రాంతానికే వెళ్తూవుంటారు.ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన అని చెప్పి ఇక్కడ ప్రజలను కనీసం సంప్రదించకుండా బాపట్ల లో కలపటం ఏమిటి? బాపట్ల జిల్లా లో కలపటం మూలన వేమూరు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము.తెనాలి ని జిల్లా చేసి వేమూరు నియోజకవర్గన్నీ తెనాలి క్రింద ఉంచాలని మా ప్రధాన డిమాండ్ జిల్లాల విభజన వల్ల రాష్ట్రం అంత ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి- ఇవి ఏవి ప్రభుత్వం కి కనపడటంలేదా!ఈ పరిస్థితి ఒక్క వేమూరు నియోజక వర్గం మే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి నెలకొంది.

అరకు పార్లమెంట్ కి సంబందించిన జిల్లాల విభజన ప్రక్రియ కూడా అందరికి ఆమోదయోగ్యం గా లేదు.

ఈ విభజన ప్రక్రియ వల్ల రాష్ట్రం లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ? ఆ విషయం ప్రభుత్వము కి తెలుస్తుందా? ప్రభుత్వము మొద్దు నిద్ర పోతుందా .కేంద్రం జిల్లాల విభజన లేదు అని సర్కలర్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా అర్ధరాత్రి జీవో తెచ్చి తూతుమంత్రంగా జిల్లాల విభజన చెయ్యటం ఏమిటి

.

Nakka Anand Babu Comments on YS Jagan Govt

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube