కోడెల బీజేపీలోకి వెళ్లాలనుకున్నారా అసలు గొడవ అదేనా?  

Our Ex Ap Assembly Speakar Wants To Join In Bjp Party - Telugu Bjp, Chandrababu Naidu, Cm Ys Jagan, Ex Speaker Kodela Siva Prasad, Kodela, Kodela Siva Prasad, Tdp, Ys Jagan

తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు, నవ్యంధ్ర తొలి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలన రేకెత్తించింది.దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా చెలరేగింది.

Our Ex Ap Assembly Speakar Wants To Join In Bjp Party

ఆయనది హత్యా అని కొందరు, ఆత్మహత్య అని కొందరు గందరగోళం రేపారు.ఇదే సమయంలో ఆయనది ఆత్మహత్యేనని పోస్ట్‌మార్టం నివేదికలో డాక్టర్లు నిర్ధారించారు.

మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆయన శరీరంపై ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు తప్ప మరేమీ లేవని చెప్పారు.అయినా కోడెల మృతిపై ఇంకా అనుమానాలు తగ్గలేదు.

కోడెల బీజేపీలోకి వెళ్లాలనుకున్నారా అసలు గొడవ అదేనా-Political-Telugu Tollywood Photo Image

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకున్న ఆయనను దగ్గరున్న ఆసుపత్రికి తరలించకుండా దూరంగా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించడం ఏంటని ప్రశ్నలు కూడా తలెత్తాయి.

 దీనికి తోడు ఆయన పార్ధివ దేహాన్ని చూసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడెల మెడపై గాట్లు ఉన్నాయని చెప్పడంతో అనుమానాలకు మరింత పెరిగిపోయాయి.కేసుల మీద కేసులతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కోడెలను, ఆయన కుమారుడిని, కూతురిని టార్గెట్ చేసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.ఇక కోడెల కుటుంబంలోనూ తరుచూ గొడవలు జరుగుతున్నాయని, ఆయనను హత్య చేయించారని మేనల్లుడు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయనది హత్య, ఆత్మహత్య అనే విషయంలో ఏ క్లారిటీ లేకుండా పోయింది.
ఇది ఇలా ఉంటే టీడీపీ అధికారంలో ఉండగా స్పీకర్ గా కోడెల వ్యవహరించారు.

అదే సమయంలో కే టాక్స్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శలు వచ్చాయి.అంతేకాదు అసెంబ్లీ పర్నీచర్‌ను తన ఇంటికి తరలించడంపై ఆయనపై వ్యతిరేకత వచ్చింది.

ఈ క్రమంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి.ఇక సొంత పార్టీలో కూడా ఆయనకు వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరాలని భావించారని, ఈ మేరకు బీజేపీ నేతలు కంభంపాటి రామ్మోహన్, సుజనా చౌదరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయంలోనే కుమారుడు శివ రామకృష్ణ గొడవలు జరిగాయని ఈ క్రమంలోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంలో అసలు విషయం ఏంటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Our Ex Ap Assembly Speakar Wants To Join In Bjp Party-chandrababu Naidu,cm Ys Jagan,ex Speaker Kodela Siva Prasad,kodela,kodela Siva Prasad,tdp,ys Jagan Related....