తెలంగాణ రాజకీయ సిత్రాలు.. జనం కోసం కాదు మా ఆరాటం.. పదవులు ఇచ్చే నేతలు బాగుండాలి.. !

ప్రజలను పట్టించుకోని నాయకులు మనకు అవసరమా అంటే కొందరి అవసరాలు మాత్రం తీరుతున్నాయిగా అందుకే ఓట్లు వేసి గెలిపిస్తున్నాం ఆని సమర్ధించుకునే వారు కూడా ఉన్నారు.ఇక ఎన్నికల్లో తమ నాయకున్ని గెలిపించడానికి కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ ఎంతో శ్రమిస్తారు.

 Our Concern In Nor For The People Political Leaders Who Give Positions Should Be Good-TeluguStop.com

ఇవన్ని మరచి గెలిచాక వీరి గెలుపుకోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టడం రాజకీయ చదరంగంలో భాగం.

ఇకపోతే ప్రస్తుత సమయంలో కరోనాతో సామాన్య జనజీవనం కుదేలవుతుంటే కొందరు రాజకీయ నేతలు మాత్రం తమ పార్టీ పెద్దలు బాగుండాలని పూజలు నిర్వహించడం ప్రజల పట్ల వారికిన్న శ్రద్ధ సృష్టంగా కనిపిస్తుంది.

 Our Concern In Nor For The People Political Leaders Who Give Positions Should Be Good-తెలంగాణ రాజకీయ సిత్రాలు.. జనం కోసం కాదు మా ఆరాటం.. పదవులు ఇచ్చే నేతలు బాగుండాలి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనాతో వందల మంది మరణిస్తున్న పట్టించుకోకుండా ఉన్న ప్రజా ప్రతినిధులు, పార్టీల అధినేతలకు చీమ కుట్టినా ఆగమేఘాల మీద హడావుడి చేస్తున్నారు.

కాగా టీఆర్​ఎస్​ బాస్​ కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోష్​ వంటి వారికి పాజిటివ్​ వచ్చిందంటే చాలు పూజలు, నోములతో ప్రార్థనలు చేస్తు ప్రత్యేక పూజలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం రాహుల్​గాంధీ క్షేమంగా ఉండాలంటూ హైదరాబాద్​లోని చార్మినార్​ భాగ్యలక్ష్మీ టెంపుల్​లో ప్రత్యేక పూజలు చేశారు.

ఇలా ఎందుకంటే జనం కోసం ఆరాటం పడితే ఏం వస్తుంది, పదవులు ఇచ్చే నేతలు బాగుంటే కాసులతో పాటుగా, అధికారాన్ని అనుభవించవచ్చనే భావన వల్ల వారి దృష్టిలో పడాలనే ఆరాటంతో ఇదంతా చేస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చూశారా ఓటర్లు తెలంగాణ రాజకీయ సిత్రాలు.ఇకనుండైనై స్వార్ధపరుల కోసం కాదు మీకోసం ఆలోచించుకోండని అంటున్నారట కొందరు.

#Corona Positive #Pooja #Minister KTR #Rahul Gandhi #Mp Santosh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు