మా బాడీస్, మా ఇష్టం.. మమ్మల్ని ఇలా వదిలేయండి.. శృతి హాసన్ వైరల్ స్టోరీ!

ఈ భూమిపై స్త్రీకి, బాలికలకు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండా పోతున్న సంగతి తెలిసిందే.ప్రతి రోజు ఏదో ఒక చోట ఏదోక అఘాయిత్యం జరుగుతూనే ఉంది.

 Our Bodies Our Choise Leave Us Like This Shruti Haasan Viral Story, Shruti Haasan, Tollywood, Post Viral, Telugu Film Industry-TeluguStop.com

అలా ఎంతోమంది ఆడబిడ్డలు రక్షణ లేకుండా ఎంతో మంది చేతుల్లో బలి అవుతున్నారు.ఇప్పటికీ ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి.

ఇక ఈ విషయం గురించి తాజాగా శృతి హాసన్ ఒక స్టోరీ పంచుకుంది.

 Our Bodies Our Choise Leave Us Like This Shruti Haasan Viral Story, Shruti Haasan, Tollywood, Post Viral, Telugu Film Industry-మా బాడీస్, మా ఇష్టం.. మమ్మల్ని ఇలా వదిలేయండి.. శృతి హాసన్ వైరల్ స్టోరీ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారత నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.

తనకున్న క్రేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

Telugu Shruti Haasan, Telugu, Tollywood-Latest News - Telugu

ఇక ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.

తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.

బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.

Telugu Shruti Haasan, Telugu, Tollywood-Latest News - Telugu

అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

అంతే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై బాగా రియాక్ట్ అవుతుంది.

ఇక ప్రస్తుతం స్త్రీలకు స్వేచ్ఛ లేనందుకు.

మమ్మల్ని ఇలా వదిలేయండి అంటూ ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకుంది.అందులో ఒక అమ్మాయి నగ్నంగా ఉండగా అందులో కొంతమంది దుర్మార్గులు ఆ అమ్మాయిపై ఇష్టం వచ్చినట్టు చేతులు వేసినట్టుగా చూపిస్తూ.

మా బాడీస్.మా ఇష్టం.

మమ్మల్ని ఇలా వదిలేయండి అంటూ షేర్ చేసుకుంది.ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ గా మారటం తో అందరి హృదయాలను కదిలించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube