విష‌పూరిత పామును తిన్న యువ‌కులు.. చివ‌ర‌కు

ఈ మ‌ధ్య కొంద‌రు చేస్తున్న ప‌ని చూస్తుంటే అస‌లు వీరు మ‌నుషులేనా ఇలా చేస్తున్నారేంటి అని అనిపించ‌క మాన‌దేమో.ఎవ‌రూ చేయన‌టువంటి ప‌నులు ఎవ‌రు చేసినా అది విచిత్ర‌మే క‌దా.

 Young People Who Ate A Poisonous Snake To The End, Snake, Viral News , Viral ,-TeluguStop.com

ఇక ఇలాంటి వాటికి సోష‌ల్ మీడియాలో ఆద‌ర‌ణ బాగానే ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ అరుదైన ఘ‌ట‌న గురించి న్య‌స్ వైర‌ల్ అవుతోంది.

ఇక ఇందులో యువ‌కులు చేసిన ప‌ని అయితే వింత‌ల‌కే వింత అన్న‌ట్టు ఉంది.ఎందుకంటే ఎవ్వ‌రైనా స‌రే కోపం వ‌స్తే కొట్ట‌డ‌మో తిట్ట‌డ‌మో చేస్తారు.

కానీ వీరు కోపం వ‌స్తే చేసిన ప‌ని చాలా డిఫ‌రెంట్ అన్న‌ట్టు ఉంది.

కొన్ని పాములు నిత్యం తామ నివాసం ఉండే ఏరియాలోకి వ‌చ్చి ప‌లువురిని కాటేస్తున్నాయని ఓ ఇద్దరు యువకులు తీవ్రా ఆవేశంతో ర‌గిలిపోయారు.

ఇక వాటిపై ఎలాగైనా ప‌గ తీర్చుకోవాల‌ని ఏకంగా సగం కాలిన పామును తిన్నారు.ఇంకేముంది ఇలాంటి పామును తిన‌డంతో వారిద్దరూ కూడా అస్వస్థ‌తతకు గుర‌య్యారు.అయితే కుటుంబీకులు వారిని ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా చికిత్స తీసుకుంటున్నారు.ఈ అనూహ్య ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా ఇందిరా నగర్ ఏరియాలో జ‌ర‌గింది.

ఆ ఇద్దరు యువకులు తాము గం కాల్చిన విషపూరిత పామును తిన‌డం వ‌ల్ల ఇలా అయింది.

Telugu Chhattisgarh, Dangorus Snake, Snake, Young-Latest News - Telugu

ఈ ఇందిరానగర్ ఏరియాలో ఎప్ప‌టి నుంచో పాములు సంచ‌రిస్తున్నాయ‌ని, చాలామందిని ఇలాగే కాటేశాయ‌ని, కాగా ఆదివారం రాత్రి కూడా ఓ పాము కనిపించగా ఇక్క‌డ నివ‌సించేవారు దాన్ని చంపేసి కాలువ దగ్గర కాల్చివేశారంట‌.అయితే పాముల‌పై కోపం పెంచుకున్న రాజు జంగ్డే, హితేంద్ర ఆనంద్ అక్క‌డ‌కు వ‌చ్చారు.అప్ప‌టికే ఆ పాము సగం కాలిపోయి ఉంది.

ఇక వారిద్ద‌రూ కూడా అప్ప‌టికే మద్యం మత్తులో ఉండ‌టంతో సగం కాలిన పామును తినడం ప్రారంభించారు.ఇంకేముంది పామును పూర్తిగా తిన్నాక వాంతులు మొదలయ్యాయి.

అయితే ఆ పాము బెలియా క్రైట్ జాతికి చెందినది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube