పవన్ నిన్ను హైదరాబాద్లో తిరగనివ్వము..ఓయూ జేఏసీ   OU JAC Warning To Pawan Kalyan     2018-01-12   23:49:15  IST  Bhanu C

కత్తి మహేష్ ఇప్పుడు మామూలు సెలబ్రిటీ కాదు..ఎన్నో కోట్ల మంది రోజు తలుచుకునే సెలబ్రిటీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినప్పటి నుంచీ పవన్ ని ఎంతమంది తెలుచుకున్తున్నారో అంతమంది కత్తి పేరుని కూడ కలవరిస్తున్నారు..పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేస్తూ సవాలు విసిరే కత్తి మహేష్ ..అనుకోకుండా కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ చానెల్ లో కత్తి మహేష్ ని ఓ రచయిత తన తల్లి గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు..

అప్పటి నుంచీ కొన్ని రోజులు సైలెంట్ అయిన కత్తి అజ్ఞాతవాసి పై అజ్ఞాన కళ్యాణ్ అంటూ తన రివ్యూ ఇస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచాడు..నిన్న రిలీజ్ అయిన “జై సింహా” పై కూడా రివ్యూ ఇచ్చి తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు..ఆ తరువాత ఒక్కసారిగా కత్తి ఓయూ ప్రాంగణంలో దర్సనం ఇచ్చాడు…అసలు కత్తి ఓయూ కి ఎందుకు వెళ్ళాడు..అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చలకి దారి తీస్తున్నాయి.వివరాలలోకి వెళ్తే..

శుక్రవారం కత్తి మహేష్ కి సపోర్ట్ గా ఓయూ జేఏసీ నాయకులు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సంఘీభావం తెలిపారు..ఈ కార్యక్రమానికి చాలా విద్యార్ధి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు ..ఈ సంధర్భంలో కత్తి మహేష్ కి ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది.ఈ సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు…పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ పై దాడి చేస్తే చూస్తూ చేతులు కట్టుకుని ఊరుకోము..కత్తి మహేష్ పై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ హైదరాబాదు లో తిరగనివ్వం..పవన్ ఒక్క సినిమా కూడా తెలంగాణలో ఆడకుండా చేస్తాం అని తెలిపారు.

ఈ సమావేశంలో కత్తికి మద్దతు తెలపడానికి వచ్చిన అందరూ “పవన్ కళ్యాణ్ హటావో” “పాలిటిక్స్ బచావో” అంటూ విద్యార్ధి సంఘాలు..జేఏసీ నాయకులు నినాదాలు చేశారు..అంతేకాదు కత్తికి తోడుగా బహుజన సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి..అయితే ఇప్పుడు కత్తి ఓయూ లో పాగా వేయడం వెనుక పెద్ద రీజనే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు మరి కత్తి ఫ్యూచర్ లో ఎలాంటి స్టెప్ తీసుకోనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.