ఓటీటీకి కొత్త వర్షన్‌ ‘ఏటీటీ’ వచ్చేసింది  

Ott Updated Version Att - Telugu Att, Movie Theaters, Ott, Ott Updated Version, Ott Users

గత కొన్నాళ్లుగా సినిమా థియేటర్లు ఓపెన్‌ కాకపోవడంతో అంతా కూడా ఓటీటీ మీద పడ్డారు.ఈ మూడు నెలల కాలంలో ఓటీటీ యూజర్స్‌ సంఖ్య దాదాపుగా 35 శాతం పెరిగినట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

 Ott Updated Version Att

ఇండియాలో ఇంత భారీ స్థాయిలో ఓటీటీ యూజర్లు పెరుగుతారని ఎవరు అనుకోలేదు.కరోనా కారణంగా ఇది సాధ్యం అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఓటీటీకి అప్‌డేటెడ్‌ వర్షన్‌ అప్పుడే వచ్చేసింది.అదే ఏటీటీ.

ఓటీటీకి కొత్త వర్షన్‌ ‘ఏటీటీ’ వచ్చేసింది-Movie-Telugu Tollywood Photo Image

ఓటీటీలో ఒక్కసారి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే అందులో వచ్చే సినిమాలన్నీంటిని కూడా చూడవచ్చు.కాని ఏటీటీలో మాత్రం ఒకసారి డబ్బులు కడితే ఒకేసారి సినిమా చూడవచ్చు.అప్పుడు చూడకుంటే మళ్లీ డబ్బులు చెల్లించాల్సిందే.అంటే థియేటర్‌ తరహా అనుకోవచ్చు.

టికెట్టు తీసుకుని లోనికి వెళ్లి సినిమా చూడవచ్చు.మళ్లీ అందులో కొత్త సినిమా చూడాలంటే మళ్లీ టికెట్లు తీసుకోవాల్సిందే.

అలా శ్రేయాస్‌ ఈటీ కూడా ఏటీటీ అంటే ఎనీ టైం థియేటర్‌ ను ప్రారంభించింది.

వర్మ రూపొందించిన క్లైమాక్స్‌ సినిమాతో పాటు పలు సినిమాలను కూడా ఈ ఏటీటీ విధానంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ కొత్త విధానం పట్ల ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.ఓటీటీ ద్వారా కంటే ఇలాగే ఫిల్మ్‌ మేకర్స్‌ ఎక్కువ లాభాలు వస్తాయని భావిస్తున్నారు.

అయితే ఈ విధానం ప్రేక్షకులపై భారం పడేలా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ott Updated Version Att Related Telugu News,Photos/Pics,Images..

footer-test