డబ్బు కంటే ప్రెస్టేజ్‌ ముఖ్యం అంటున్న మన స్టార్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఓటీటీని తక్కువ అంచనా వేస్తున్నారు.ఒక మోస్తరు హీరోలు కూడా తమ సినిమా ఓటీటీలో విడుదల అయితే ఎక్కువ పరువు తక్కువ అవుతుందో అనే ఉద్దేశ్యంతో నిర్మాతకు భారం అయినా కూడా థియేటర్లలో విడుదల చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారట.

 Tollywood Star Heros Don't Want To Release Movies In Ott  Ott, Tollywood Heros,-TeluguStop.com

టాలీవుడ్‌ లో విడుదలకు సిద్దం అయిన నాలుగు అయిదు సినిమాలు ఓటీటీ లో విడుదల కావాల్సి ఉంది.నిర్మాతలకు భారీ ఆఫర్‌ చేస్తున్నా కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దంగా లేరు.

హీరోలు మరియు దర్శకులు తమ సినిమాలు ఖచ్చితంగా థియేటర్లలో విడుదల అవ్వాలంటూ నిర్మాతల నెత్తిన బలంగా నష్టాలను రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.అంతగా నష్టాలు వస్తే తదుపరి సినిమా మీకే చేస్తాం.

ఇప్పుడు పారితోషికంలో కూడా కట్‌ చేసుకుంటాం అంటూ హామీ ఇస్తున్నారట.

రవితేజ, రామ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతో పాటు మరికొందరు హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్దం అయ్యాయి.

వారు కూడా తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దని నిర్మాతలకు సూచించారు.దాంతో గత అయిదు ఆరు నెలలుగా కోట్ల రూపాయలకు వృదాగా వడ్డీలు కడుతు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు.

తెలుగు స్టార్‌ హీరోలు ఇలా ఫ్రిస్టేజ్‌కు పోవడం వల్ల నిర్మాతలు కోట్లల్లో నష్టపోవాల్సి వస్తుంది.బాలీవుడ్‌ స్టార్‌ అయిన అక్షయ్‌ కుమార్‌ వంటి వారు నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆయన నటించిన సినిమాలు ఓటీటీలో విడుదలకు ఆయన ఎలాంటి అడ్డు చెప్పడం లేదు.కేవలం అక్షయ్‌ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఇలా ఓటీటీకి ఓకే చెబుతున్నారు.

కాని మన తెలుగు హీరోలు మాత్రం థియేటర్లలో మాత్రమే తమను తాము చూసుకోవాలనుకుంటున్నారు.మంచి నిర్ణయమే అయ్యి ఉండవచ్చు కాని నిర్మాత పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు మూడు నెలల వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో కాదు కదా కనీసం 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా నడిచే అవకాశం లేదు.కనుక నిర్మాతలు మరింతగా నష్టపోవాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube