ఇక నుంచి వాళ్ళు సినిమాలు ముందే చూసి కొంటారట…  

OTT platforms Taking Big Decision before purchasing a movie, OTT platforms, Disney plus Hotstar, Amazon Prime, Netflix, Tollywood movies, - Telugu Amazon Prime, Disney Plus Hotstar, Netflix, Ott Platforms, Ott Platforms Taking Big Decision Before Purchasing A Movie, Tollywood Movies

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లను తాత్కాలికంగా మూసివేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో వడ్డీలకు డబ్బు తెచ్చి నిర్మించినటువంటి భారీ బడ్జెట్ చిత్రాల విడుదల ఆగిపోవడంతో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా కుదేలయింది.

TeluguStop.com - Ott Platforms Taking Big Decision Before Purchasing A Movie

దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తమ చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ కి అమ్ముకునేందుకు కొందరు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

అయితే ఇదే పరిపాటి అనుకొని కొన్ని ఓటీటీ సంస్థలు వినియోగదారులను పెంచుకునేందుకుగాను బడ్జెట్ కి ఏమాత్రం వెనుకాడకుండా డబ్బులు వెచ్చించి భారీ బడ్జెట్ చిత్రాలను కూడా కొనుగోలు  చేస్తున్నారు.

TeluguStop.com - ఇక నుంచి వాళ్ళు సినిమాలు ముందే చూసి కొంటారట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అనంతరం తమ ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో ప్రమోట్ చేసుకుంటూ విడుదల చేస్తున్నారు.అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల కి ఉన్నటువంటి క్రేజ్ ని చూసి వందల కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీ అధికారులు నష్టాలను చవి చూస్తున్నారు.

దీంతో కొందరు ఇక నుంచి తాము కొనుగోలు చేసేటువంటి చిత్రాలను కంటెంట్ టీమ్ చూసిన తర్వాతే ధరలు నిర్ణయించడం అలాగే తాము చిత్రాలను తీసుకోవాలా.  వద్దా అనే నిర్ణయం తీసుకునే వెసులు బాటు కల్పించాలని దర్శక నిర్మాతలు అసోసియేషన్ను కోరుతున్నారట.

అంతేగాక వ్యూస్ ని బట్టి కూడా చిత్రానికి రేటు చెల్లిస్తామని షరతులు విధిస్తున్నారు.

అయితే ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరో చిత్రాన్ని డిస్ని ప్లస్ హాట్ స్టార్  దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుక్కుంది.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ అధికారులు నష్టాన్ని మూట గట్టుకున్నారు.అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

#DisneyPlus #OTTPlatforms #Amazon Prime #Netflix #OTT Platforms

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ott Platforms Taking Big Decision Before Purchasing A Movie Related Telugu News,Photos/Pics,Images..