ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడితే పరిస్థితి ఏంటీ?

కరోనా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది.సినిమా పరిశ్రమపై దాని ప్రభావం అన్నింటి కంటే ఎక్కువే కనిపిస్తుంది.

 Ott Platforms, Movies, Theaters, Closed, Corona Effect-TeluguStop.com

ఇతర రంగాలు ఈ విపత్తు తర్వాత కోలుకుంటాయేమో కాని సినిమా పరిశ్రమ మాత్రం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల అంటున్నారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లు ఉంటే అందులో సగానికి పైగా మూత పడే పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం థియేటర్లు బంద్‌ ఉండటంతో ప్రేక్షకులు ఓటీటీపై ఆధారపడుతున్నారు.

ఈమద్య కాలంలో సినిమాలు చూసేందుకు ఓటీటీని ఏ స్థాయిలో ఆశ్రయిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వందల కోట్లల్లో ఉండే ఓటీటీ బిజినెస్‌ ఇప్పుడు వేల కోట్లకు పెరిగింది.ఈ స్థాయిలో ఓటీటీ బిజినెస్‌ పెరగడం ఒకింత సినిమా పరిశ్రమకు భయాందోళనకు కలిగిస్తోంది.

అభివృద్ది చెందిన దేశాల్లో థియేటర్లకు సినిమాలు చూసేందుకు వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది.వారంతా కూడా ఓటీటీని ఆశ్రయిస్తున్నారు.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఓటీటీకి అలవాటు పడితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

Telugu Corona Effect, Ott Platms, Theaters-

ఇప్పటికే సినిమాలు విడుదల అయిన తర్వాత ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా వెయిట్‌ చేద్దాం అనుకునేవారు ఎక్కువ అయ్యారు.ఇక ఇప్పుడు సినిమాలు విడుదల లేక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు మళ్లీ థియేటర్లకు వస్తాడనే నమ్మకం లేదు అంటున్నారు.తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు రాకుంటే సినిమా రంగం కుదేళవ్వడం ఖాయం.

సినిమా నిర్మాణం సగంకు పడిపోవడంతో పాటు అన్ని వర్గాల వారికి కష్టాలు తప్పవంటూ ఒక సినీ విశ్లేషకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.వచ్చే ఏడాది వరకు పరిస్థితి ఇలాగే ఉంటే పూర్తిగా ఓటీటీని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

అప్పుడే ఏం జరుగుతుందో చూడాలని ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఒకరు అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube