ఓటీటీ అభిమానులకు అదిరిపోయే న్యూస్..!

గడిచిన 10 నెలలుగా కరోనా వైరస్ వ్యాధి కారణంగా థియేటర్లు అన్ని కూడా మూతపడిన సంగతి అందరికీ తెలిసిందే.థియేటర్లు మూత పడటంతో ప్రేక్షకులు అందరూ ఓటిటి ప్లాట్ ఫామ్ పై మొగ్గుచూపుతున్నారు.

 Netflix Free Access To Users For Two Days, India, Ott Platform, Netflix, Free Ac-TeluguStop.com

ఇక తాజాగా ఓటిటి ప్లాట్ ఫాం లో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఒక శుభవార్త తెలియజేసింది.యూజర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్ట్రీమింగ్ ఫెస్ట్ డిసెంబర్ 5న అధికారికంగా ప్రారంభిస్తామని నెట్ ఫ్లిక్స్ తెలియజేసింది.ఈ స్ట్రీమింగ్ ఫెస్ట్ డిసెంబర్ 5 తెల్లవారుజామున 12.01 నుంచి డిసెంబర్ 6 న 11.59 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ యూజర్లకు తెలిపింది.అంతేకాకుండా ఈ 48గంటల పాటు అభిమానులు ఉచితంగా సినిమాలను వెబ్ సిరీస్ లను భారతీయ భాషల్లోనే కంటెంట్ ఉచితంగా యూజర్లకు అందజేయనున్నట్లు తెలియచేసింది.

అలాగే నెట్ ఫ్లిక్స్ లో చందాదారులు కాని వారు కూడా ఈ ఫెస్ట్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది.

భారత ఓటిటి ప్లాట్ ఫామ్ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్, జి5, డిస్నీ హాట్ స్టార్ వంటి ఓటిటి ప్లాట్ ఫామ్ కి గట్టి పోటీగా నిలిచేందుకు రెండు రోజుల పాటు ఉచితంగా కంటెంట్ ను వీక్షించేందుకు యూజర్లకు అవకాశం కల్పిస్తుంది చూడడం గమనించవలసిన విషయం.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన కథలను నెట్ ఫ్లిక్స్ లో వీక్షించేందుకు నెట్ లింక్ అందిస్తుంది.ప్రేక్షకులను రంజింప చేసేందుకే ఈ రెండు రోజులపాటు మేం స్ట్రీమింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని సంస్థ భారత ఉపాధ్యక్షురాలు మౌనిక తెలియజేశారు.

Telugu Disney Hot, Access, India, Netflix, Netflixaccess, Ott Platm-Latest News

ఇక ఈ స్ట్రీమింగ్ టెస్ట్ లో కంటెంట్ ను వీక్షించడం కోసం యూజర్ల వద్ద మీ ఈమెయిల్ ఐడి లేదా పేరు లేదా ఫోన్ నెంబర్ తో సులువుగా యాక్సిస్ చేసుకోవచ్చు.ఇక ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా యూపీఐ చెల్లింపులో అవసరం లేదు అని కంపెనీ స్పష్టంగా తెలియజేసింది.అలాగే లాగిన్ సమాచారాన్ని మరొకరు వినియోగించుకునేందుకు వీలు లేదు అని ఆ సంస్థ పేర్కొంది.అలాగే లాగిన్ అయినాక ఎవరైనా సరే స్టాండర్డ్ డెఫినేషన్ లో వీడియోలను వీక్షించేందుకు అవకాశం కల్పించిందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube