టాలీవుడ్ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ వరుస సినిమాలు చేస్తున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు.
ఇక ఇటీవలే ఈయన ఆచార్య సినిమా భారీ ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాలపై మరింత ఫోకస్ పెట్టి చేస్తున్నాడు.
మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.
చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.ఇక ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ సోషల్ మీడియాను సైతం షేక్ చేయడంతో పాటు మెగా ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎగ్జైట్ గా ఎదురు చూసేలా చేసింది.

ఈ టీజర్ లో చిరుతో పాటు నాయన తార, సల్మాన్ ఖాన్ ను కూడా చూపించి మరింత ఆసక్తి కలిగేలా చేసారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం ప్రముఖ ఓటిటి సంస్థలు అన్ని పోటీ పడగా చివరకు దిగ్గజ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.