'శాటిలైట్'కు దెబ్బ కొడుతున్న ఓటీటీ.. ఎలా అంటే?

శాటిలైట్ ను ఓటీటీ దెబ్బ కొడుతుంది.దీంతో రాబోయే రోజుల్లో శాటిలైట్ డిమాండ్ ఏ విధంగా ఉండ‌బోతుంద‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

 Ott Effect On Trps And Satlight Rights  Ott, Satilight, Ott Subscribers, Lock Do-TeluguStop.com

క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగ్ లు పూర్తిగా ఆగిపోయాయి.దీంతో టాలీవుడ్ కు 3వేల ‌కోట్లకు పైగా న‌ష్టాల బాట‌ప‌ట్టిన‌ట్లు సినీ పెద్ద‌లు చెబుతున్నారు.

క‌రోనా కు ముందు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉన్నా.క‌రోనా తో వాటి బిజినెస్ పెరిగింది.

దానికి తోడు అంద‌రి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండ‌డంతో అవికాస్త పునాదిగా మారాయి.

లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీల సబ్ స్క్రిప్ష‌న్లు బాగా పెరిగాయి.

దీనికి తోడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ చాలా పెద్ద‌ది.సంఖ్య‌ప‌రంగా చూస్తే బాలీవుడ్ కి పోటాపోటీగా సినిమాలు విడుద‌ల‌వుతాయి.

దీన్ని క్యాష్ చేసుకునేందుకు విప‌రీతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

దీంతో చిన్న సినిమా థియేట‌ర్ల‌నుంచి, మల్టీ ఫ్లెక్స్ ల వ‌ర‌కు.

మ‌ల్టీ ఫ్లెక్స్ ల నుంచి.టీవీల వ‌ర‌కు విడుద‌ల‌య్యే సినిమాను ఇష్ట‌ప‌డే వారు త‌గ్గిపోయారు.

చేతిలో ఫోన్ ఉంటే ఎలాంటి సినిమా అయినా ఇంట్లోనే కూర్చొని కుటుంబ ‌స‌భ్యులంద‌రూ చూడొచ్చు.దీనివ‌ల్ల థియేట‌ర్లకు ఆడియ‌న్స్ రాక‌పోవ‌డంతో శాటిలైట్ హ‌క్కులు త‌గ్గిపోయి…డిజిట‌ల్ స్ట్రీమింగ్ రేట్స్ పెరిగిపోతున్నాయి.

థియేట‌ర్ల‌లో హిట్ అయిన చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు టీవీ రేటింగ్ ల్లో పోటీ ప‌డేవి.కానీ ఓటీటీల వ‌ల్ల ఇటీవ‌ల విడుద‌లైన నిశబ్ధం, భానుమ‌తి రామ‌కృష్ణ‌, ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాలకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

కానీ టీవీల్లో విడుద‌లైన ఈ సినిమాల‌ను చూసే సాహ‌సం చేయ‌డం లేదు.

డిజిటల్ స్ట్రీమింగ్ వ‌ల్ల కొంత సాఫ్ట్ ఫోర్న్ మూవీస్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ధ్య చూసే ఈ సాఫ్ట్ పోర్న్ మూవీస్ ఓటీటీల వ‌ల్ల డైర‌క్ట్ గా ఇంట్లోనే చూసే వెసు‌ల‌బాటు ఉంది.ప్ర‌స్తుతం ఇలాంటి ఇబ్బందులు త‌లెత్తినా క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చిన త‌రువాత ఎలా ఉంటుందో అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube