కరోనా పుణ్యాణ సినిమా థియేటర్లకు వెళ్లేందుకు జనాలు కాస్త తగ్గారనే చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో చాలా మంది జనాలు ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.దీంతో చాలా మంది ఫోన్ లోనే సినిమాలు చూస్తున్నారు.
అంతేకాదు.నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు ఓటీటీనే దిక్కుగా మారింది.
ప్రస్తుతం ఓటీటీ సంస్థలు కూడా నూతన జనరేషన్ కు తగ్గట్లుగా కంటెంట్ ను రూపొందిస్తున్నారు.ప్రతివారం ట్రెండింగ్ కు అనుగుణంగా పలు సినిమాలను స్ట్రీమ్ చేస్తున్నాయి.తాజాగా ఈ వారంలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహా
ఈ వారం ఆహాలో.యంగ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు తేజ కాంబోలో వచ్చిన అర్జున ఫల్గున సినిమా జనవరి 28న స్ట్రీమ్ కానుంది.ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ షో టాక్ నెగెటివ్ గా వచ్చింది.అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.అయితే ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది త్వరలో వస్తుంది.
హాట్ స్టార్

-మలయాళం మూవీ బ్రో డాడీ జనవరి 26న స్ట్రీమ్ అవుతుంది.-హిందీ మూవీ తడప్ జనవరి 28న స్ట్రీమ్ కానుంది.-ద ప్రామిస్ ల్యాండ్ అనే వెబ్ సిరీస్ జనవరి 25న స్ట్రీమ్ అవుతుంది.-ద గిల్డెడ్ ఏజ్ అనే వెబ్ సిరీస్ జనవరి 25న స్ట్రీమ్ కానుంది.
నెట్ఫ్లిక్స్

– కొరియన్ సిరీస్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ జనవరి 28న స్ట్రీమ్ కానుంది.-గెట్టింగ్ క్యూరియస్ విత్ జొనాథన్ వాన్నెస్ అనే వెబ్ సిరీస్ కూడా జనవరి 28న రిలీజ్ కానుంది.–హోమ్ టౌన్ అనే హాలీవుడ్ మూవీ కూడా జనవరి 28న రిలీజ్ అవుతుంది.-స్పోపియర్స్ అనే వెబ్ సిరీస్ జనవరి 25న స్ట్రీమ్ కానుంది.–ద సిన్నర్ అనే సిరీస్ సీజన్ జనవరి 26న స్ట్రీమ్ కానుంది.–ప్రేమ్డ్ అనే వెబ్ సిరీస్ జనవరి 27న స్ట్రీమ్అవుతుంది.-ఫెరియా అనే హాలీవుడ్ మూవీ జనవరి 28న రిలీజ్ కానుంది.
జీ

-మలయాళ మూవీ ఆహా జనవరి 26న స్ట్రీమ్ కానుంది.– హిందీ సిరీస్ పవిత్ర రిష్తా జనవరి 28న స్ట్రీమ్ కానుంది.
ఊట్

– కన్నడ మూవీ బడవ రాస్కెల్ 26న రిలీజ్ కానుంది.
ఈరోస్ నౌ

హాలీవుడ్ మూవీ బరున్ రాయ్ అండ్ ది క్లిఫ్ జనవరి 28న స్ట్రీమ్ కానుంది.