ఒక పాడి బర్రె ఉదాహరణ ఈ రోజు తప్పకుండ చర్చించాలి.పాడి బర్రె అంటే పాలిచ్చే బర్రె లేదా గేదె అని అర్ధం.
ఒక పాలు ఇచ్చే బర్రె ఉంటె రోజు వారీగా ఆదాయం సమకూరితేనే ఉంటాయి.దానికి కాస్త పోషణ ఇస్తే చాలు చేతి నిండా డబ్బు.
ఇక్కడ పాడి బర్రె టాపిక్ ఎందుకు అంటే ఎంత పెద్ద స్టార్ అయినా లేదా అప్ కమింగ్ అయినా ప్రతి ఒక్కరు పాలు ఇచ్చే బర్రె వలే చూసేది కేవలం ఓటిటి ( OTT ) ఇండస్ట్రీ వైపే.నిన్నటికి నిన్న సుడిగాలి సుధీర్ ని( Sudigali Sudheer ) చుడండి.
ఎన్నో కష్టాలు పడి టీవీ ని నమ్ముకొని చాల డబ్బు సంపాదించాడు.పేరు కూడా సంపాదించాడు టీవీ తో పెద్దగా పని లేదు సినిమాల్లో బిజీ అయిపోయాడు.

అది కూడా పోతే ఎలా అనే ఆలోచన రాగానే ఓటిటి ఉంది కాబట్టి అనిల్ రావిపూడి తో ఒక షో చేసి బాగానే క్లిక్ అయ్యాడు.ఇక ఒక్క సుడిగాలి సుధీర్ మాత్రమే కాదు.మరి కొన్ని రోజుల్లో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కమెడియన్ అయినా వెన్నెల కిషోర్( Vennela Kishor ) కూడా ఒక షో తో రాబోతున్నాడు.సమంత ( Samantha ) స్టార్ హీరోయిన్ గా ఎంత బిజీ అనే విషయం అందరికి తెలుసు అయినా కూడా సామ్ జామ్ ప్రోగ్రాం చేసి సక్సెస్ కొట్టింది.
ఇక ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మరొక వ్యక్తి బాలయ్య.అన్ స్టాపబుల్ షో సక్సెస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.బాలయ్య చేస్తున్న క్రేజీ స్టార్స్ ఇంటర్వూస్ కి సర్వర్ కెపాసిటీ కూడా సరిపోవడం లేదు.మరి బాలయ్య మజాకా.
అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్ కి సినిమాలు బోలెడు ఉన్నప్పటికీ స్టాండప్ కామెడి చేయిస్తున్నాడు ఓటిటి లో.

ఇలా చాలామంది టీవీ లేదా ఓటిటి ని నమ్ముకుంటూ కెరీర్ ని పదిలంగా పెంచుకుంటున్నారు.స్టార్ హీరోలు అయినా లేదా ఏదైనా ఒకటి చేసి హిట్ కొట్టాలి చూసేవారికైనా కూడా ఇక్కడ బోలెడన్ని అవకాశాలు ఉన్నాయ్. కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలకు కూడా నాసిరకం సినిమా అయినా సరే తీసుకొని కొన్ని ఓటిటి ల్లో వేస్తున్నారు.
అందుకే చేసుకున్నవారికి చేసుకున్నంత.మంచి టాపిక్ ఉంటె చాలు ఇక్కడ ఎలాటి అద్భుతం అయినా చేయచ్చు.
ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్ కి వెళ్లి ఎవరు చూడటం లేదు.అందరు బాహుబలులు తీయాలంటే వందల కోట్లు ఎవరు పెడతారు చెప్పండి.
