సైరాట్ దర్శకుడి అసలు రూపం ఇదా..అతడి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన మాజీ భార్య...     2018-10-11   12:11:28  IST  Raja

“సైరాట్” దేశంలోనే ఒక సంచలనం..పేరుకు మరాఠా చిత్రం అయినా దేశ ప్రజలందరిని కట్టిపడేసింది..భాష అర్దం కాకున్నా భావం అర్దం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు..చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు ప్రేక్షకులను వెంటాడింది ఆ సినిమా.. ఈ సినిమానే రీమేక్ గానే శ్రీదేవి కూతురు జాన్వి తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే అంతలా ఆకట్టుకోవడానికి అందులో ఏం చూపించారు..దేశంలో సాగుతున్న పరువు హత్యలను ఒళ్లు జలదరించేలా చూపించాడు దర్శకుడు..దాంతో ఒక్కసారిగా ఆ సినిమా దర్శకుడు నాగరాజు మంజులే పేరు మార్మోగిపోయింది…..అయితే తన సినిమాలో మహిళల సమస్యలను చూపించే ఆయన ,తన సొంత భార్యకే నరకం చూపించాడనే సంచలన విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి…

నాగరాజ్ తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు అతని భార్య..మీటూ ఉద్యమంలో భాగంగా ముంజులే మాజీ భార్య సునీత పలు విషయాలను బయటపెట్టారు.సునీత చెప్పిన విషయాలు తన మాటల్లోనే.. పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడు,నాగరాజ్ మంజేలేతో వివాహం అయింది.పెళ్లి తర్వాత, ఒకవైపు దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతూ మరోవైపు చదువును కంటిన్యూ చేసేవాడు…అలా వేరే నగరానికి వెళ్లి చదువుకునేవాడు.దాంతో కుటుంబ బాద్యతలు నాపైన పడ్డాయి.నేను ఆ ఇంటికి పెద్దకోడల్ని..దాంతో ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకున్ని నిలబడ్డారు..నా భర్తను ప్రేమించాను, గౌరవించాను. కానీ అతని ప్రవర్తన మారిపోయింది. ఇంటికి నేరుగా అమ్మాయిలను తెచ్చుకుని వారితో గడిపేవాడు. నేనే వారికి వండిపెట్టేదాన్ని. సాధారణ గృహిణిని కదా బేలగా.. నన్ను వదలిపెట్టకండి అని బతిమాలాను. కానీ అతను రాక్షసంగా ప్రవర్తించాడు…అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాదు పిల్లలు పుడితే సినిమాలకు అడ్డంకి అని నేను గర్భం దాల్చాక అబార్షన్‌ చేయించుకోమని హింసించాడు. మూడు సార్లు అతని కారణంగా బిడ్డను పోగొట్టుకున్నాను. నాగరాజ్‌ తీసిన ‘పిస్తుల్యా’ డాక్యుమెంటరీకి జాతీయ అవార్డుకు వచ్చినప్పుడు మరో దారుణానికి ఒడిగట్టాడు. వారంతా అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్లారు.అప్పుడు నన్ను గదిలో బంధించారు. ఈ హింసాత్మక కాపురం వద్దని మా పుట్టింటికి వెళ్లిపోయాను.2014లో విడాకులు తీసుకుని చట్టప్రకారం విడిపోయాం అని చెప్పారు..ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో పాచిపని చేసుకుని జీవనం వెళ్లదీస్తున్నారు సునీత.విడాకుల సమయంలో ఏడు లక్షల భరణం ఇచ్చారన్నారు.