రాజుగారు గ్రేట్‌.. కానీ, మేం భ‌రించ‌లేం...!

“వైసీపీ నా ర‌క్తం తాగింది!“ -అంటూ. న‌ర‌సాపురం ఎంపీ.

 Rajugaru Great But We Cant Tolarate Him, Ysrcp Mp,raghu Rama Krishnam Raju,tolar-TeluguStop.com

వైసీపీ అస‌మ్మ‌తినేత‌.క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చేసిన వ్యాఖ్య‌లు దాదాపు అన్ని పార్టీల్లోనూ.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.వాస్త‌వానికి ఆయ‌న ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ స‌ర్కారుపై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌తి విష‌యాన్నీ పాలిటిక్స్ చేయ‌డం, ఏకంగా జ‌గ‌న్‌నే టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించ‌డం.సై అంటే సై అనేలా స‌వాళ్లు రువ్వ‌డం.

ప్ర‌భుత్వ విధానాల‌కు, పార్టీ విధానాల‌కు కూడా వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే.తాజాగా మ‌రింత న‌ర్మ‌గ‌ర్భంగా ఆయ‌న పార్టీ నార‌క్తం తాగింద‌ని చెప్పుకొచ్చారు.

నిజ‌మే.రాజకీయాల్లో ఉన్న‌వారు.లేనివారికి కూడా ర‌ఘురామ వ్యాఖ్య‌ల అంత‌రార్థం ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక అవ‌స‌రాల కోసం పార్టీలు టికెట్లు ఇచ్చిన అభ్య‌ర్థుల నుంచి అంతో ఇంతో తీసుకుంటాయి.

వాటికి ఇష్ట‌ప‌డే ఎన్నిక‌ల్లో టికెట్ల‌ను ఆశించ‌డం ఇటీవ‌ల కాలంలో నాయ‌కులకు ప‌రిపాటిగా మారింది.అంతేకాదు, అలా ఇచ్చి పుచ్చుకునే వ్య‌వ‌హారాల్లోనూ ఫుల్ కాంపిటిష‌న్ ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే, ఇది వైసీపీకే ప‌రిమిత‌మైంద‌ని అనుకుంటే పొర‌పాటే.ప్ర‌తి పార్టీలోనూ ఉన్న‌దే.

అయితే, ఆయా అంశాల‌ను నాయ‌కులు గుట్టుగా ఉంచుకుంటారు.కానీ, ఇప్పుడు రాజుగారు బ‌య‌ట ప‌డే స‌రికి.

నిన్న‌టి వ‌ర‌కు రాజుగారు గ్రేట్ అన్న‌.కొన్ని పార్టీలు ఇప్పుడు.

ఆయ‌న‌తో చాలా క‌ష్ట‌మే.భ‌రించ‌లేం.

అనేస్తున్నాయి.

Telugu Deep Ysrcp, Delhi, Raghurama, Tolarate, Ysrcp, Ysrcp Mp-Telugu Political

ఇలాంటి నాయ‌కుడుని తెలిసి తెలిసి రేపు ఏ పార్టీ భ‌రిస్తుంద‌ని అంటున్నారు న‌ర‌సాపురం ప్ర‌జ‌లు.నిజ‌మే.నాయ‌కుల‌న్నాక ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంప్ చేస్తారు.

కానీ, సొంత ఇంటికే సున్న‌కొట్టాల‌ని చూసే నేత‌ల‌ను ఎవ‌రు మాత్రం చేర్చుకుంటారు?  పార్టీని ఎన్నిక‌ల సంఘం ముందు ప‌లుచ‌న చేసేలా వ్య‌వ‌హ‌రించారు.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు మ‌తాన్ని అంట‌గ‌ట్టేలా వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా చాణిక్యుడు ఎప్పుడో కొన్ని వంద‌ల ద‌శాబ్దాల కిందట చెప్పారంటూ.ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోసే చ‌ర్య‌లు చేశారు.

అనే అంశాల‌పైనా చ‌ర్చించుకుంటున్నారు.
వీటిని ప‌రిశీలిస్తున్న ఇత‌ర పార్టీలు.

మాత్రం రేపు ఇలాంటి నాయ‌కుడు త‌మ పార్టీలో ఉండాల‌ని కోరుకుంటాయా?  ఉద్యోగంలో అయినా.రాజ‌కీయాల్లో అయినా.

విన‌యం.విశ్వాసం.

అనే రెండు అంచుల ప్ర‌యాణం ఎవ‌రికైనా త‌ప్ప‌దు.ఈ సున్నిత క‌ట్టుబాటును దాటేసిన వారి ప‌రిస్థితి రాజ‌కీయాల్లో ఏమైందో అదే ప‌రిస్థితి మ‌నోడికి కూడా ప‌డుతుంద‌ని న‌ర‌సాపురం ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఏదేమైనా.రాజుగారి వ్యూహాలపై దాదాపు అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ జ‌రుగుతుండ‌డం విశేషం.

మున్ముందు ఈ ప‌రిణామం.ఆయ‌న‌కు చేటు తెచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube