ప‌వ‌న్ చెప్పేదొక‌టి చేసేదొక‌టి... పార్టీని వాళ్ల‌తోనే నింపేస్తున్నాడుగా

వినూత్న‌, పార‌ద‌ర్శ‌క రాజ‌కీయాలకు అంబాసిడ‌ర్‌ను నేనేనంటూ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన జ‌న‌సేనాని ప‌వ‌న్.వైఖ‌రిపై విభిన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

 Other Party Leaders Joinsjansena-TeluguStop.com

ఆయ‌న మాట‌లు, వైఖ‌రిలో నిల‌క‌డ లేక‌పోవ‌డం, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూ డా క్లారిటీ రాక‌పోవ‌డం వంటివి ఆయ‌న‌ను సందేహాల పుట్ట‌గా మార్చేస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న సిద్ధాంతాల కు క‌ట్టుబ‌డి రాజ‌కీయాలు చేస్తే.

పొలిటిక‌ల్‌గా ఎంత మేర‌కువిజ‌యం సాధిస్తాడ‌నేది కూడా సందేహంగానే ఉంది.ఇక‌, తాజాగా విష‌యంలోకి వెళ్తే.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో తాను 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.అంతేకాదు, త‌న‌ది ఇక, ఒంట‌రి పోరేన‌ని అన్నారు.

అయితే, కొమ్ములు తిరిగిన పార్టీల‌కే ఇప్పుడు నేత‌లు క‌రువ‌య్యారు.అలాంటిది.ప‌వ‌న్ పార్టీకి నేత‌లు ఎక్క‌డ నుంచి వ‌స్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.పోనీ.

ఇత‌ర పార్టీల్లోని నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తారా? మాజీల‌కు పెద్ద పీట వేస్తారా? అనేది కూడా ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది.దీనికి ప్ర‌ధాన కార‌ణం.

తాను ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు.అయితే, 175 నియొజ‌క‌వ‌ర్గాల్లోనూ కీల‌కంగా పోటీ ఇవ్వ‌గ‌లిగిన స‌త్తా ఉన్న నాయ‌కులు జ‌న‌సేన‌లో ఎలా ఉంటారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.పోనీ.త‌న మాట‌ల‌ను తానే గ‌ట్టున పెడ‌తాడా? అంటే ఇప్ప‌టికీ ఎలాంటి క్లూ ఇవ్వ‌డం లేదు.అయితే,ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు మాత్రం ప‌వ‌న్ పిలుపే ఆల‌స్యం అన్న విధంగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవ‌ల కాంగ్రెస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌స్తుతం తెర‌మ‌రుగైన వ‌ట్టి వ‌సంత కుమార్‌.

ప‌వ‌న్ పార్టీలో చేరేందుకు తాను సిద్ధ‌మ‌ని చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.అదేవిధంగా తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కొంద‌రు కాపు నాయ‌కులు, మాజీ మంత్రులు కూడా ప‌వ‌న్ చెంత‌కు చేరేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం.

అయితే, ప‌వ‌న్ ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.దీనికితోడు ఆయ‌న నిర్వ‌హిస్తున్న యాత్ర‌ల్లోనూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు తీవ్ర గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తున్నాయి.

త‌న‌కు అధికారం అక్క‌ర్లేద‌ని చెబుతూనే.మీరు మా ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే.

అధికారంలోకి వ‌స్తాన‌ని చెబుతుండ‌డం విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది.

ఇక‌, ఈ విష‌యాన్నిప‌క్క‌కు పెట్టినా.

ప‌వ‌న్‌.త‌న అభ్య‌ర్థుల విష‌యంలోనూ ఇప్ప‌టికీ క్లారిటీ ఇవ్వ‌లేక పోతున్నాడు.

కొత్త‌గా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకునేట‌ట్ట‌యితే.ఇప్ప‌టి నుంచే ఎంపిక ప్ర‌కియ సాగితే బాగుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి మాత్రం దీనికి భిన్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మొత్తానికి ఇప్ప‌టికైతే ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలిపై నెటిజ‌న్లు కామెంట్లు ఎక్కుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube