రేవంత్ కు ఇతర పార్టీల నాయకుల ఉచిత సలహాలు... వ్యూహంలో భాగమేనా

తెలంగాణలో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.రాజీవ్ రైతు భరోసా దీక్షలను ప్రారంభించి ఆ తరువాత పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

 Other Party Leaders Suggestions To Revanth Reddy, Revanth Reddy,   Other Party-TeluguStop.com

ప్రస్తుతం పాదయాత్ర కూడా కొనసాగుతున్నది.అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ల నుండి ఆశించిన మద్దతు రాలేదు.

దీనిని గమనించిన ఇతర పార్టీల నాయకులు రేవంత్ కు ఇతర పార్టీల నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారట.ఎందుకంటే పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్ల సహకారం లేదని గమనించిన నాయకులు రేవంత్ ని రెచ్చగొట్టి పార్టీ మారాలనే సలహాలు ఇస్తున్నారట.

ఇందులో ఉన్న అసలు కిటుకును గమనిస్తే రేవంత్ కాంగ్రెస్ పార్టీ నుండి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ పరిస్థితి మరల మొదటికి వస్తుందన్న వ్యూహమే రేవంత్ ను వేరే పార్టీలో చేరితే నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సలహాలు ఇస్తున్నారట.భవిష్యత్తులో రేవంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.

ఇప్పటికే ఓ పార్టీ రేవంత్ కు ఆహ్వానం పలికిందని,కాని వారి ఆహ్వానాన్ని రేవంత్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయం వరకు రేవంత్ వేచి చూసే ధోరణిలోనే ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube