తెలుగు లో ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన ఇతర బాషా దర్శకులు

తెలుగు జ‌నాల‌కు సినిమా న‌చ్చితే చాలు.భాష‌తో సంబంధం లేకుండా ఆద‌రిస్తారు.

 Https://telugustop.com/wp-content/uploads/2021/05/other-languages-directors-who-working-in-telugu-director-mahesh-bhatt-director-prathap-pothendirector-dharani-images.jpg-TeluguStop.com

అందుకే చాలా మంది మంది త‌మిళ హీరోలకు ఇక్క‌డ ఫ్యాన్స్ ఉన్నారు.హీరోల వ‌ర‌కు ఎందుకు.

త‌మిళ డైరెక్ట‌ర్లు మ‌ణిర‌త్నం, శంక‌ర్ మూవీస్ అన్నింటినీ తెలుగు సినిమాల్లాగే ఫీల‌వుతారు.ఆ డైరెక్ట‌ర్లు తెలుగులో స్ట్రెయిల్ సినిమా తీస్తే బాగుంటుంద‌ని అనుకున్నారు.

 Https://telugustop.com/wp-content/uploads/2021/05/other-languages-directors-who-working-in-telugu-Director-Mahesh-Bhatt-Director-Prathap-Pothendirector-dharani-images.jpg-తెలుగు లో ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన ఇతర బాషా దర్శకులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఎక్కువ చేయ‌లేదు.కొంత మంది ఇత‌ర భాష‌ల ద‌ర్శ‌కులు మాత్ర‌మే తెలుగులో సినిమాలు చేశారు.అలా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఇత‌ర భాష‌ల డైరెక్ట‌ర్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

మ‌ణిర‌త్నం

త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన మ‌ణిర‌త్నం తెలుగులో ఒకేఒక్క సినిమా చేశాడు.అదే గీతాంజ‌లి.ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

బాల మ‌హేంద్ర‌

ఈ ద‌ర్శ‌కుడు కూడా త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన వాడే.నిరీక్ష‌ణ అనే తెలుగు సినిమా చేశాడు.

ప‌వ‌న్ వ‌డేయ‌ర్

క‌న్న‌డ సూప‌ర్ హిట్ ద‌ర్శ‌కుడు అయిన ప‌వ‌న్.తెలుగులో మంచు మ‌నోజ్ తో పోటుగాడు అనే సినిమా తీశాడు.

మ‌హేష్ భ‌ట్

అలియా భ‌ట్ తండ్రి, ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్.తెలుగులో నాగార్జున హీరోగా క్రిమ‌నల్ అనే సినిమా చేశాడు.

ప్ర‌తాప్ పోత‌న్

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిన ప్ర‌తాప్ పోత‌న్ త‌మిళంలో కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.అనంత‌రం తెలుగులో చైత‌న్య అనే సినిమా తీశాడు.

ఉపేంద్ర

ఉపేంద్ర క‌న్న‌డ‌లో తీసిన ఓం సినిమాను తెలుగులో రాజ‌శేఖ‌ర్ హీరోగా పెట్టి ఓంకారం అనే పేరుతో మూవీ చేశాడు.

విష్ణువ‌ర్థ‌న్

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా పంజా సినిమా చేశాడు విష్ణు వ‌ర్థ‌న్.ఈ సినిమాలో ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ ను అద్భుతంగా ప్ర‌సెంట్ చేశాడు.

ధ‌ర‌ణి

త‌మిళ స్టార్ ఫిల్మ్ మేక‌ర్ ధ‌ర‌ణి.తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా బంగారం అనే సినిమా చేశారు.

శాజీ కైలాస్

మంచు విష్ణు డెబ్యూ మూవీ ని తీసింది ఈ మ‌యాలం ద‌ర్శ‌కుడే కావ‌డం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube