అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఉంది.తెలుగు సినీ దర్శకులే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు సినిమాల రేంజ్ పెంచడానికి మొత్తం పాన్ ఇండియా సినిమాలు ఎంచుకుంటున్నారు.

 Heroes Of Other Languages Performing As Villains In Tollywood Movies ,tollywood,-TeluguStop.com

ఇక బాహుబలి సినిమా తర్వాత మంచి మంచి బాక్సాఫీస్ రికార్డు సినిమాలన్నీ వరుసగా రావడంతో టాలీవుడ్ లో మరింత క్రేజ్ కనిపిస్తుంది.ఇక ఇతర సినీ పరిశ్రమ నటీనటులు కూడా టాలీవుడ్ సినిమాలపైనే ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే పలు సిని పరిశ్రమల నుండి నటీనటులు టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.ఆ నటీనటులు తమ సినీ పరిశ్రమలో ఓ స్టార్ హీరోలనే సంగతి మీకు తెలుసా.

అవును ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన కొందరు నటులు స్టార్ హీరోలు అవగా.వాళ్లు తెలుగు సినిమాలలో విలన్ గా నటిస్తున్నారు.ఇంతకు వారెవరంటే.

రాజా రాణి సినిమా హీరో, ప్రముఖ తమిళ నటుడు ఆర్య పదేళ్ల కింద తెలుగు సినిమాల్లో విలన్ గా నటించాడు.

అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా లో విలన్ గా చేశాడు.ఇక బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ విలన్ గా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు.

అది కూడా సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక భోజ్ పురిలో స్టార్ హీరోగా ఉన్న రవి కిషన్ రేసుగుర్రం వంటి ఇతర సినిమాల లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Telugu Anil Kapoor, Arya, Bollywood, Fahaad Fazil, Heros, Language Heroes, Ravi

అంతేకాకుండా మరో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా టాలీవుడ్ లో నటిస్తున్నాడు.కన్నడ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుదీప్.ఈగ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.అంతే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ గా బాగా నటించాడు.ఇక ఇటీవలే విడుదలైన ఉప్పెన సినిమా గురించి తెలిసిందే.అందులో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి గురించి అందరికీ పరిచయమే.

ఇదిలా ఉంటే మలయాళ సూపర్ స్టార్ పహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ గా నటించనున్నట్లు ప్రకటన కూడా వచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube