ఓయూ ని తాకిన కరోనా,ఏకంగా 12 మందికి పాజిటివ్  

Osmania University Students Corona Positives - Telugu Corona Positive, Coronacases, Coronavirus, Hyderabad, Osmania University, Telangana

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం విదితమే.ఈ వైరస్ ధాటికి భారత్ కూడా తలాకుతలం అవుతుంది.

 Osmania University Students Corona Positives

లాక్ డౌన్ ను సడలించడం తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది.ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నాయి కూడా కరోనా ను మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి.

తాజాగా తెలుగు రాష్ట్రం తెలంగాణా లోని ఉస్మానియా యూనివర్సిటీ లోని 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలడం కలకలం సృష్టించింది.హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఉస్మానియాలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది.

ఓయూ ని తాకిన కరోనా,ఏకంగా 12 మందికి పాజిటివ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

296 మంది విద్యార్థులు కళాశాలలోనే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో, కళాశాలలో ఉంటున్న విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు.ఈ టెస్టుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది.

ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తుంది.రేపటిరోజున కొన్ని రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది.

దీంతో మొత్తం యూనివర్సిటీ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కు కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగానే ఉందని కాలేజీ ప్రిన్సిపల్ శశికళ మీడియా ద్వారా వెల్లడించారు.

వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి.అయితే ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారందరిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కూడా కరోనా టెస్ట్ లు చేయిస్తున్నారు.

అలానే ఇప్పటికే యూనివర్సిటీ లోని,క్లాస్ లు,ల్యాబ్ ల మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ నెల పరీక్షలు ఉన్నందున 296 మంది కళాశాలలోనే ఉంటూ ప్రిపేర్ అవుతుండగా 12 మందికి పాజిటివ్ తేలింది.

దీనితో మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని,అయితే రేపు రిపోర్టులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మరి ఇంకెందరికి ఈ కరోనా సోకిందో అన్న విషయం రేపు నిర్ధారణ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test